సాధారణంగా దసరా పండుగ వచ్చింది అంటే చాలు ఇక ఊరూవాడా అంతా ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది. దసరా పండుగ తొమ్మిది రోజుల ముందు నుండి అందరూ దుర్గా మాత కు పూజలు చేయడం మొదలుపెడతారు. అంతేకాదు ఇక ఎక్కడికక్కడ దుర్గామాత ప్రతిమలను ప్రతిష్టించి ఇక దేవినవరాత్రి పూజలు పేరిట ఎంతో ఘనంగా తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను కొలుస్తారు అని చెప్పాలి. అంతేకాదు ఇక విభిన్న రూపాలలో ఉన్న దుర్గామాత ప్రతిమలను ప్రతిష్ఠించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు చాలామంది. ఇలా  ఒక షెడ్ ఏర్పాటు చేసి దుర్గామాత ప్రతిమను ప్రతిష్ఠించటం చూసాము. కానీ ఇక్కడ మాత్రం ఆ రైతు వినూత్నంగా ప్రయత్నించాడు. ఎక్కడో షెడ్ వేసి దుర్గామాత ప్రతిమను ప్రతిష్ఠించడం కాదు. ఏకంగా వంట పొలంలోనే దుర్గామాతను ప్రతిష్ఠించాడు. అదికూడా ప్రతిమ రూపంలో కాదు ఏకంగా పచ్చడి పొలాన్ని దుర్గామాత గా మార్చాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా అత్తోటలో చోటుచేసుకుంది. గ్రామ రైతు పాపారావు ఆవిష్కరించిన అద్భుతమైన దుర్గామాత చిత్రపటం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటాడు రైతు పాపారావు. అయితే ఆయన వేసిన వరి నాటులో ఇలా అద్భుతంగా దుర్గామాత రూపురేఖలు వచ్చే విధంగా ఈ అద్భుతాన్ని రూపొందించాడు.అంతె కాదు ప్రకృతి వ్యవసాయం పై అందరికీ అవగాహన కూడా కల్పిస్తున్నాడు రైతు పాపారావు. అయితే ఇలా చేయడం కొత్తేమీ కాదు  ఇప్పటి వరకు తన పంట పొలంలో ఎన్నోసార్లు ఇలాంటి అద్భుతాలను చేశారు. గతంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ ఆకృతిని తన పొలంలో రూపొందించారు. అంతేకాదు స్వదేశి వస్త్రాలకు ఆలంబనగా నిలిచే నూలు వడికే రాట్నం ఆకృతిని కూడా గతంలో తన పొలంలో రూపొందించారు ఈ రైతు. ఇక ఇప్పుడు ఏకంగా దసరా సందర్భంగా దుర్గామాత చిత్రపటాన్ని తన పొలంలో రూపొందించి అద్భుతం సృష్టించారు. ఇక ఇది చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: