పెళ్లిలో బంగారం పెట్టే సంప్రదాయం మన ఇండియాలో ఉంది. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో వధువుకు పెళ్లి సమయంలో వరుడి తరపు వారు బంగారం పెడతారు. కొత్త నగలు చేయిస్తారు. ఇదే సమయంలో వధువు తరపు వారు కూడా వరునికి బంగారు నగలు చేయిస్తారు. అయితే అమ్మాయికి చేయించేవే ఎక్కువ పరిణమాంలో ఉంటాయి. అందుకే కట్నకానుకల ప్రస్తావన వచ్చినప్పుడే ఈ బంగారం గురించి కూడా సంప్రదాయపెళ్లిళ్లలో కచ్చితంగా మాట్లాడేసుకుంటారు.


ఈ పెట్టుపోతల విషయం ఎలా ఉన్నా.. చైనాలోని ఓ కొత్త పెళ్లి కొడుకు.. తనకు కాబోయే భార్య కోసం పెట్టిన బంగారు నగల విషయం తెలిస్తే నోరు వెల్లబెట్టడం ఖాయం. ఎందుకంటే.. కాబోయే భార్యకు ఆ చైనా వరుడు ఇచ్చిన భారీ కానుక ఆ రేంజ్‌లో ఉంది మరి. ఆ కానుకలు చూసి ఆ వధువే కాదు.. ఆమెతో పాటు బంధువులూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ కానుకల పరిమాణం చూసిన వధువు.. బంగారం లాంటి భర్త తనకు దొరికాడని ఆమె మురిసిపోయి ఉంటుంది. ఇక తోటి వారంతా ఆ వరుడిని సరదాగా.. నీ ప్రేమ బంగారంగానూ అని ఆటపట్టించే ఉంటారు.


ఎందుకంటే.. ఈ వరుడు ఇచ్చింది కాస్తో కూస్తో కాదు.. ఏకంగా 60 కేజీల బంగారునగలు.. అవును మీరు వింటున్నది నిజమే.. అచ్చంగా 60 కేజీల బంగారు నగలే. చైనాలోని హుబే రాష్ట్రంలో ఈ వింత జరిగింది. అక్కడ సెప్టెంబర్‌ 30న జరిగిన ఓ వివాహ వేడుకలో వధువుకు వరుడు 60 కిలోల బంగారు ఆభరణాలు బహూకరించాడు. ఆ వధువు ఆ 60 కేజీల బంగారాన్ని అలంకరించుకోవడానికి అష్టకష్టాలుపడింది.


అవును కదా.. ఎంత బంగారమైనా శరీరంపై 60 కేజీల నగలు మోయడం అంటే ఎంత కష్టం. అయినా భర్త ఇష్టంతో కొనిచ్చినవి కదా.. అందుకే ఇబ్బంది పడినా 60 కేజీల బంగారు నగలతో అలంకరించుకుంది. ఆమె ధరించిన బంగారు నగల్లో 60 బంగారు నెక్లెస్‌లు ఉన్నాయట. ఇవి ఒక్కోటి కిలో బరువు ఉంటాయట. అలాగే మరో నాలుగు భారీ బంగారు గాజులు కూడా ఇచ్చాడండోయ్. ఈ నగలతో ఆ వధువు  పాపం నడవడం కూడా కష్టమైపోయిందట. ఆ కుర్రాడే కాస్త చేయిపట్టి నడిపించాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: