రాష్ట్రం విడిపోయాక రాజ‌ధాని పంచాయితీ మొద‌లు పెట్టాడు జ‌గ‌న్. అప్పుడు మాట్లాడ‌కుండా త‌రువాత మాట్లాడ‌డంతోనే త‌గాదాలు వ‌చ్చాయి. అమ‌రావ‌తి ఎనౌన్స్ మెంట్ త‌రువాత జ‌గ‌న్ మాట్లాడితే ఇంత‌టి వివాదం లేదు. ఇదొక ఎత్తు.ఇదే జ‌గ‌న్ ను కొంప ముంచ‌నుంది. మ‌రొక‌టి ఏంటంటే సంక్షేమాన్ని న‌మ్ముకుని చంద్ర‌బాబు చేసిన కాస్త అభివృద్ధి ని కూడా నిలిపివేయడం నాటి బిల్లులు కోర్టులు చెబితేనే చెల్లించడం..ఇది మ‌రొక ఎత్తు. ఇలాంటి ఎత్తుగ‌డ‌ల్లో చంద్ర‌బాబు పై జ‌గ‌న్ విజ‌యం సాధించారు. కాద‌నం కానీ రేపు ఆయ‌న జ‌నం మ‌ద్ద‌తు పొందుతారా?

ఇంకా చెప్పాలంటే...:
జ‌గ‌న్, చంద్ర‌బాబు రాజకీయాల్లో అత్యంత శ‌క్తిమంతం అనుకునే వ్య‌క్తులు. చంద్ర‌బాబు ఈ సారి గెల‌వ‌క‌పోతే టీడీపీ ఇక ఇంటికే అ న్న మాట ఒక‌టి వైసీపీ వ‌ర్గం నుంచి వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో వైసీపీకి కూడా ఇలాంటి గ‌తే ప‌డుతుంద‌ని టీడీపీ అంటోం ది. ఎవ‌రు ఏమ‌నుకున్నా జ‌గ‌న్ క‌న్నా చంద్ర‌బాబు కొన్ని నిర్ణ‌యాల్లో బాగుంటారు అన్న‌ది స‌త్యం. అదేవిధంగా కొన్ని నిర్ణ‌యాల అమ లులో జ‌గ‌న్ పాస్ మార్కులు తెచ్చుకోవ‌డ‌మే కాదు ఫ‌స్ట్ క్లాస్ మార్కులు వ‌చ్చేందుకు కృషి కూడా చేస్తున్నారు. కానీ దేశ ప్ర‌ధాని మోడీ నే నివ్వెరపోయేలా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు అన్న‌ది జ‌గ‌న్ కే సాధ్యం. దీని వ‌ల్ల‌నే రాష్ట్ర ఆర్థిక రంగం పూర్తిగా దివాలా తీ సింది. అప్పులు పుట్ట‌డం లేదు. అవ‌స్థ‌లు త‌ప్ప‌డం లేదు.

నోట్ల పంపిణీ వ‌ద్దు గాక వ‌ద్దు :
జ‌గ‌న్ వ‌చ్చాక ల‌క్ష కోట్ల సంక్షేమం అన్న‌ది ఏడాదికి వెచ్చిస్తున్నారు. అదేవిధంగా అంత స్థాయిలో ప‌థ‌కాల అమ‌లు అయితే లేదు అన్న విమ‌ర్శ‌లున్నాయి. ముఖ్యంగా గ‌త టీడీపీ ప్ర‌భుత్వం కూడా ఇంత‌టి స్థాయిలో డ‌బ్బులు అధికారికంగా పంచ‌లేద‌న్న వాస్త వం ఒక‌టి మీడియాలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. కేంద్రం కూడా ఉచిత ప‌థ‌కాల‌కు అస్స‌లు మ‌ద్దతు ఇవ్వ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు రెవెన్యూ లోటుతో బండి లాగిస్తున్న జ‌గ‌న్ కు ఎప్ప‌టిక‌ప్పుడు ఆర్థికంగా స‌వాళ్లు వ‌స్తూనే ఉన్నాయి. కేవ‌లం పాల‌న‌కు సంబంధించి నోట్ల పంపిణీయే త‌ప్ప మ‌రొక‌టి ఏదీ క‌నిపించ‌డం లేదన్న ఆరోప‌ణ‌ల‌ను టీడీపీ చేస్తూ వ‌స్తోంది. ఈ ద‌శ‌లో జ‌గ‌న్ ను ఓడించే శ‌క్తి ఏమౌతుంది. దివాళా రాజ‌కీయాంలో ప‌త‌నం ఎవ‌రిది? ఎవ‌రికి?

మరింత సమాచారం తెలుసుకోండి: