ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వం పట్ల కొన్ని సామాజిక వ‌ర్గాల నేత‌లు తీవ్ర స్థాయిలో ర‌గి లి పోతోన్న ప‌రిస్థితి ఉంది. అయితే అంద‌రి కంటే జ‌గ‌న్ కు ముందు నుంచి స‌పోర్ట్ చేసే ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గం రెడ్డి వ‌ర్గంలోనూ తీవ్ర‌మైన అసంతృప్తి ఉందా ?  జ‌గ‌న్ పార్టీ పెట్టిన ప్ప‌టి నుంచి ఆయ‌న‌కు ఎంతో వెన్ను ద‌న్ను గా ఉన్న ఈ రెడ్డి వ‌ర్గం నేత‌లు ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న చూసి ర‌గిలి పోతున్నారా ? అంటే అవున‌ని ఆ వ‌ర్గం వారే చెవులు కొరుక్కుంటున్నారు.

ఇక ఏపీ రాజకీ యాల్లో కొద్ది రోజులు గా ఇదే విష‌యం వార్త ల్లో హైలెట్ అవుతోంది. జగన్ పాలన పట్ల రెడ్డి సామాజికవర్గం అసంతృప్తిగా ఉందన్నది గ‌త రెండేళ్ల నుంచి విన్పిస్తున్న మాట. ఎందు కంటే ఈ వ‌ర్గం నేత‌ల్లో ఎక్కువ మంది వైసీపీ ని గెలిపించి.. జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అయితే ఇప్పుడు వారంద‌రూ జ‌గ‌న్ త‌మ‌ను ప‌ట్టించు కోవ‌డం లేద‌ని.. త‌మ‌కు ప‌ద‌వులు కాదు క‌దా.. క‌నీసం త‌మ వ్యాపారాలు కూడా నాశ‌నం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక రెడ్ల లో చాలా మందికి జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక క‌నీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ట‌. ఇక జ‌గ‌న్ అగ్ర వ‌ర్ణాల్లో చాలా మందికి ప‌లు ప‌థ‌కాలు కోత‌లు పెట్టేస్తూ , బీసీ , ఎస్సీ వ‌ర్గాల ఓటు బ్యాంకును టార్గెట్ గా పెట్టుకుని రాజ‌కీయం  చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. ఇక త‌మ సామాజిక వ‌ర్గంలో ఎమ్మెల్యే లు, ఎంపీలుగా ఉన్న వారు మిన‌హా సాధార‌ణ ప్ర‌జ‌ల కు కూడా జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల ఎంత మాత్రం ఉప‌యోగం లేద‌ని వారు వాపోతున్నారు. మ‌రి వీరంతా క‌లిసి క‌ట్టుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు దెబ్బ క‌ట్టాల‌ని క‌సితో ర‌గులుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: