గత ఏడున్నర సంవత్సరాల నుంచి  తిరుగులేని శక్తిగా ముందుకు పోతున్న కేసీఆర్, గత రెండు మూడు నెలల నుంచి ఆయన ప్రాబల్యం పడిపోతుందని తెలుస్తోంది. టిఆర్ఎస్ ప్రాబల్యం ఎందుకు పడిపోతుంది. కారణాలు ఏమిటి.. తెలుసుకుందామా..? దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనా..?
రోజురోజుకు టిఆర్ఎస్ ప్రభ తగ్గుతుందా..? విపక్షాల వైపు తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందులో  భాగంగానే వరంగల్ సభ పెట్టబోతున్నారా కెసిఆర్  అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కెసిఆర్ అవునంటే కాదని కాదంటే అవునని చేస్తాడని రుజువైంది అంటూ కూడా అంటున్నారు. మొదటి నుంచి కూడా కేసీఆర్  నైజం ఇదే తీరుగా ఉంది. సర్కార్ తీరుపై  తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతుంది. ఈ మొత్తం పరిణామాలతో కేసీఆర్ లో వణుకు మొదలైంది అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నవంబర్ 15న వరంగల్లో సభ అంటూ కొత్త పలుకులు అందుకున్నారు కెసిఆర్.

ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా తెలంగాణ విజయ గర్జన  ఉండబోతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. పార్టీ గ్రాఫ్ పడిపోతుందనే,సభ ఏర్పాటూ చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్  చెప్పేది చేయరు చేసేది చెప్పారని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా సభ ప్రకటన పైన  ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు,ఎంపీలపై  రోజురోజుకు వ్యతిరేకత కూడా పెరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు కెసిఆర్ చెప్తున్నాడు. కానీ ముఖ్యమంత్రికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో  కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఒకసారి అవునని ఒకసారి కాదని చెప్పి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. దాన్ని ఇక్కడ ఉదాహరణగా తీసుకోవాలనే చర్చ కూడా జరుగుతోంది.ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం కేసీఆర్ కు ఉందని రాజకీయ  విశ్లేషకులు భావిస్తున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎంపీలు మీద  కూడా  ప్రజల నాడీ  వ్యతిరేకంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: