ప్రపంచ దేశాలలో మతం పట్ల సంఘర్షణలు పెరిగిపోతున్నాయి. ఒకదేశంలో ఒక మతాన్ని మాత్రమే ప్రోత్సహించాలని అనే ఉద్దేశ్యం పెరిగిపోతుంది. ఇలా చేయడం కూడా ఇతర దేశాలలో ఉన్న భిన్నత్వాన్ని దెబ్బతీసే వ్యూహంగా నిపుణులు భావిస్తున్నారు. తాజాగా సంభవించిన మత ఘర్షణలు కూడా దానికి సంబంధించినవే అంటున్నారు నిపుణులు. మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఆయా దేశాలలో ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. దీనిద్వారా ఆయా మతాల వారు ఎక్కడ ఉన్నా వారిని ఆయా దేశాలు వేరు చేసే అవకాశాలు ఏర్పడి, దేశంలో ఉన్న ఐక్యత దెబ్బతింటుంది. అప్పుడు అంతర కలహాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యక్షంగా యుద్ధం చేసే సాంప్రదాయ విధానానికి విరుద్ధంగా ఇలాంటి పన్నాగాలు స్థిరమైన దేశాలపట్ల అస్థిర పడ్డ దేశాలలోని కొన్ని శక్తులు పన్నుతున్నాయి.

నిజానికి ఎక్కడైనా ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకునే హక్కు ఉంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకమతం మీద అటువంటి దెబ్బ తగిలినప్పుడు మిగిలిన వారు ఖచ్చితంగా దానిని ప్రశ్నిస్తే, అది తమవరకు రాకుండా ఉంటుంది. లేదంటే ఏదో ఒకనాడు అది వారి మతం వరకు వస్తే అప్పుడు వారికి కూడా తోడుగా ఉండే సామజిక బాధ్యత లోపించి, అందరు ఒంటరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి ఇలాంటి స్థితి వస్తే, ఆఫ్ఘన్ ఆక్రమణ లాంటివి తీవ్రంగా జరుగుతాయి. అప్పుడు ప్రతిఘటించడం ఎవరు చేయరు కాబట్టి, తుపాకీ పట్టుకున్న వాడిదే రాజ్యం అవుతుంది. అంటే ఈ కుట్రల వెనుక ఎవరు ఉండవచ్చు అనేది అందరికి స్పష్టం అయ్యిందనే అనుకుంటాను.  

తమ దేశాన్ని గుర్తించలేదనే అక్కసుతో ఇప్పటి వరకు సంఘటితంగా జీవించిన సమాజాన్ని ముందు విడదీసి అనంతరం తమ వ్యూహాన్ని అమలు చేయాలని ఉగ్రమూకలు చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇది. దీనిని సమాజంలో ప్రతి ఒక్కరు ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ రోజు ఒకరికి జరిగింది, రేపు మరొకరికి జరిగితీరుతుంది. ప్రతిఘటన లేకపోతే వ్యూహాలను పన్నిన వారి పని మరింత సులువు అవుతుంది. మతఘర్షణలు సృష్టించడం సులువు అనేది వాళ్ళు కనిపెట్టారు అంటె, వ్యూహం ప్రారంభం అయ్యిందనే అర్ధం. మత స్వేచ్ఛ సమాజానికి అవసరం, అంటే ఎవరి మతం వాళ్ళు పాటించుకోగలగటం, ఇష్టం లేని వారు దానికి దూరంగా ఉంటె ఉండనివ్వు, అది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు మతద్వేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం ప్రతిఘటించాల్సిన ఆవశ్యకత అందరిపై ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: