ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యే లు ఇప్పుడు వ‌రుస‌గా ఏదో ఒక వివాదంలో చిక్కు కుంటున్నారు. ఇప్ప‌టికే నెల్లూరు జిల్లాకు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు సొంత పార్టీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొం టున్నారు. ఇక జిల్లా లో అంద‌రూ వైసీపీ ఎమ్మెల్యేలు ఉండ‌డంతో వీరిలో వీరికి కూడా ప‌డ‌డం లేదు. ఇదిలా ఉంటే పా ర్టీ సీనియ‌ర్ నేత‌, ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై ఆ పార్టీ సీనియర్ నేత లు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మె త్తు తున్నారు. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ చేజర్ల సుబ్బారెడ్డి, పలువురు నేతలు మేక‌పాటి తీరుపై మండి ప‌డుతున్నారు. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్రతి చిన్నపనికి ఓ రేటు కట్టి పెద్ద ఎత్తున అక్రమాలకి పాల్పడుతున్నార‌ని ఫైర్ అయ్యారు.

చివ‌ర‌కు పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారిని ప‌క్క‌న పెట్టేస్తూ... పార్టీ పదవులు కూడా అమ్ముకుంటూ, ఆరు నెలలకోసారి ఒక్కొక్కరిని మార్చేస్తున్నార‌ని వాపోయారు. నియోజ‌క‌వ‌ర్గంలోని వింజమూరు మండల కన్వీనర్ పదవిని ఆరు నెలల్లో ముగ్గురుకి మార్చార‌ని.. ఇక ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల్లో జెడ్పీటీసీ టిక్కెట్టు కోసం రూ.50లక్షలు ఇచ్చామ‌న్నారు. చివ‌ర‌కు ఎంపీపీ ప‌ద‌వుల‌కు కూడా రేట్లు క‌ట్టి మ‌రీ అమ్ముకున్నార‌ని ఆయ‌న వాపోయారు. అస‌లు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మేకపాటి కుటుంబంలో ఎలా పుట్టారా ? అనిపిస్తోంద‌ని విమ‌ర్శించారు.

ఇక పార్టీ అధినేత జగన్ పాదయాత్ర సమయంలో పదివేల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే, కనీసం త‌మ‌కు ఇప్పుడు పార్టీలో గౌరవం లేకుండా పోయింద‌ని ప‌లువురు నేత‌లు వాపోతున్నారు. ఏదేమైనా వైసీపీ నుంచే రెండు సార్లు గ‌తంలో కాంగ్రెస్ నుంచి ఓ సారి గెలిచిన చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల నుంచే ఈ స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి రావ‌డంతో ఆయ‌న పార్టీలో హాట్ టాపిక్ గా మారారు. ఇక ఇది ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: