2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరు కూడా పార్టీల నాయకత్వం వహించడమే అనే విషయం స్పష్టంగా తెలిసింది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో ఎవరో ఒకరి మాట వినాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నాయకత్వం వహించడం తో పార్టీ క్షేత్రస్థాయిలో పూర్తిగా నష్టపోయిందని అనే విషయం స్పష్టంగా అర్థమైంది. చాలామంది నాయకులు రేవంత్ రెడ్డి విషయంలో అలాగే కొంతమంది సీనియర్ నాయకులు విషయంలో అసంతృప్తిగా ఉండటం కాంగ్రెస్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన దెబ్బ గా మారిందనే విషయం క్లియర్ గా అర్థమైంది.

ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉంటుందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. తెలంగాణ భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించటానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో కష్టపడుతుంటే కొన్ని కొన్ని జిల్లాల్లో సొంత ప్రయత్నాలను కొంతమంది నాయకులు ఎక్కువగా చేస్తున్నారని నాయకులను ఎదిగే క్రమంలో భారతీయ జనతా పార్టీలో వర్గాలను కూడా తయారు చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక కీలక నేత అలాగే నల్లగొండ జిల్లాకు చెందిన ఒక కీలక నేత సొంత ప్రయత్నాలు చేయడం పార్టీని కష్టాల్లోకి నెడుతోంది అని అంటున్నారు.

రాజకీయంగా పార్టీకి ప్రస్తుతం చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేకపోయినా నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట గాని లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటగానే వినాల్సిన నాయకులు సొంత రాజకీయం చేయడం అలాగే నాయకులుగా చలామణి కావడానికి పార్టీ కార్యకర్తలను వాడుకోవడం ఇబ్బంది పెడుతున్న అంశం. మరి ఈ పరిస్థితిని బండి సంజయ్ కుమార్ మారుస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp