టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పార్టీ కోసం త‌న త‌న‌యుడిని ప‌క్క‌న పెడుతున్నారా అనే మాట‌లు వినిపిస్తున్నాయి. దీంతో తండ్రిపై లోకేష్ గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. త‌న ట్యాలెంట్‌ను నిరూపించుకోవ‌డం కోసం అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని వచ్చే ఎన్నిక‌ల్లో త‌న యాత్ర‌కు అడ్డుప‌డుతున్నార‌ని పార్టీలో త‌న కూట‌మిని ఎద‌గ‌నివ్వ‌డం లేద‌ని లోకేష్ భావిస్తున్నాడ‌ట‌. కానీ, కొడుకు భ‌విష్య‌త్ కోసం బాబు ఏ నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదని తెలుస్తోంది. దీంతో చాలా విష‌యాల్లో లోకేష్‌ను ఆయ‌న నిర్ణ‌యాన్ని బాబు ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింది.
 

  2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాలు వైసీపీకి బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఆ త‌రువాత పీకే తో డీల్ సెట్ చేసుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నించిన ఫ‌లించ‌లేదు. అదే స‌మ‌యంలో పీకేను ఏపీలో మ‌రోసారి వైసీపీ రంగంలోకి దించుతార‌ని స్ప‌ష్టం అయింది. మంత్రుల‌తో స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ చెప్ప‌డం ఎన్నిక‌లంటూ హొంట్ ఇవ్వ‌డంతో చంద్ర‌బాబుకు మ‌రో షాక్ త‌గిలింది. అందుకే లోకేష్‌ను చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టేశారు. ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో లోకేష్‌ను టార్గెట్ చేస్తూ పీకే టీం టీడీపీకి చేసిన డ్యామేజ్ చంద్ర‌బాబుకు ఇంకా గుర్తుంది.

    కొడుకుపై చంద్ర‌బాబుకు విప‌రీత‌మైన ప్రేమ ఉండొచ్చు కానీ న‌మ్మ‌కం లేదు. పార్టీ నేత‌లు కూడా ఇదే అనుకుంటున్నార‌ట‌. దీంతో ఈ సారి పార్టీని చంద్ర‌బాబు ముందు ఉండి న‌డిపించాల‌ని కోరుకుంటున్నారు.  ఇప్పుడు ఉన్న క్లిష్ట ప‌రిస్థితుల్లో లోకేష్‌ను తెర‌మీద‌ర‌కు తెవ‌డం కంటే చంద్ర‌బాబే తాడోపేడో తేల్చుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే లోకేష్‌ను వ్య‌తిరేకిస్తున్నార‌ట‌. కాగా, లోకేష్ సైకిల్ యాత్ర చేయాల‌నుకున్నారు. కానీ, ఆ యాత్ర‌కు చంద్ర‌బాబు బ్రేక్ వేశార‌ని తెలుస్తోంది. లోకేష్ కూట‌మి నుంచి వ‌స్తున్న ఏ ఒక్క‌రిని కూడా చంద్ర‌బాబు ఎంక‌రేజ్ చేయ‌డం లేద‌ట‌. ఒక ర‌కంగా సీనియ‌ర్ల‌తోనే ఈ సారి ఎన్నిక‌ల‌ను ఎదుర్కొవాల‌ని బాబు ఆలోచ‌న‌. ఈ నేప‌థ్యంలో త‌న త‌న‌యుడిని పార్టి లో ప్రియారిటీ త‌గ్గిస్తున్నాడ‌ని తెలుస్తోంది. అధికార పార్టి త‌న కొడుకు మీద అవాకు చెవాకు పేల‌కుండా బాబు చూసుకుంటున్నాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.మరింత సమాచారం తెలుసుకోండి: