భారత్‌పై పెత్తనం చేసేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే... అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై కన్నేసిన ఆక్రమణకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చివరికి దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటనపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ. అసలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారత ఉప రాష్ట్రపతి ఎలా పర్యటిస్తారని కూడా ప్రశ్నించింది. దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా బదులిచ్చింది. ఇక తూర్పు లఢాక్‌లో ఇప్పటికి పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ప్రత్యేక గ్రామాలను నిర్మించి... అక్కడకు ప్రజలను కూడా తరలిస్తోంది చైనా దేశం. అలాగే సరిహద్దు వరకు బలగాలను వేగంగా తరలించేందుకు బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం కూడా పూర్తి చేసింది చైనా. ఇక సరిహద్దుల సమస్యపై ఇప్పటికే డ్రాగన్ కంట్రీ కీలక ఒప్పందం చేసుకుంది. భారత్‌కు మరింత చేరువయ్యేందుకు భారత్ పొరుగునున్న భూటాన్ దేశంలో ఒప్పందం కుదుర్చుకుంది చైనా. సరిహద్దుల సమస్య పరిష్కారానికి కీలక అడుగులు వేస్తోంది డ్రాగన్ కంట్రీ.

చైనా-భూటాన్‌ల మధ్య జరిగిన సరిహద్దు సమస్య పరిష్కారానికి కీలక ఒప్పందం చేసుకున్నాయి రెండు దేశాలు. మూడు దశల చర్చల ద్వారా.... సరి హద్దు  సమస్య పరిష్కరించుకునేందుకు రెండు దేశాల అధికారులు ఇప్పటికే సమావేశమయ్యారు. సమస్య పరిష్కారం కోసం ఒక రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు. భూటాన్ దేశంలో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలే పరిష్కారం అని తాజాగా చైనా వ్యాఖ్యానించింది. ఇందులో భాగంగా ఇప్పటికే భూటాన్ దేశ విదేశాంగ శాఖ అధికారులతో ఒక దఫా చర్యలు కూడా జరిపారు డ్రాగన్ కంట్రీ అధికారులు. ఈ నెల 14వ తేదీన జరిగిన వర్చువల్ మీటింగ్‌లో చైనా రాజధాని బీజింగ్, భూటాన్ రాజధాని ధింపూ మధ్య బంధం మరింత బలోపేతం చేసేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. దాదాపు 400 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును భూటాన్‌తో చైనా పంచుకుంటోంది. అయితే తొలి నుంచి రెండు దేశాల మధ్య బోర్డర్ వార్ జరుగుతూనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: