తెలంగాణాలో పార్టీ బలోపేతం కోసం సిఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకు తెలుసు. రాజకీయంగా పార్టీ విషయంలో ఆ పార్టీ కీలక నాయకులు అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు. చాలా మంది నాయకులు పార్టీకి దూరంగా ఉన్నా సరే సిఎం కేసీఆర్ ఇప్పుడు చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమైంది. నేడు పార్టీ నాయకుల సమావేశంలో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ వచ్చే నాటికి విపత్కర పరిస్థితులు ఉండేవి అని సిఎం కేసీఆర్ అన్నారు.

ఒకప్పుడు వల్లకాడుల ఉండే ఊర్లు ఇప్పుడు ప్రజలు ఉండేలా మారాయి అని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక చాలా పనులు చేసుకున్నామని సిఎం కేసీఆర్ తెలిపారు. ఇంకా చాలా పనులు చేసుకోవాల్సి ఉంది అని అన్నారు ఆయన. కొన్ని వర్గాలకు పనులు జరిగాయి అని వివరించారు. ఇంకొన్ని వర్గాలకు జరగాల్సి ఉంది అన్న కేసీఆర్... వాళ్లకే చేస్తారా అనడం సరి కాదు..అవసరాన్ని బట్టి అందరికీ చేస్తాం అని తెలిపారు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని చేస్తాం అని స్పష్టం చేసారు.

 
ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఒక గేమ్ అని కానీ టిఆర్ఎస్ కు రాజకీయం అంటే ఒక టాస్క్ అని స్పష్టం చేసారు. నర్సింహులు నాకు మంచి స్నేహితుడు అని స్నేహం చనిపోయే వరకు ఉంటుంది అని ఆయన వివరించారు. ఎక్కువ దుఃఖం ఉన్నోళ్లను ముందు ఆదుకుంటాం అని తెలిపారు. ఎక్కువ వెనుకబడ్డ దళితుల కోసం మొదట దళిత బంధు తెచ్చాము అన్నారు ఆయన. రాయచూరు బీజేపీ ఎంపీ తెలంగాణ పథకాలు అమలు చేయాలని కోరుతున్నారు అన్నారు. లేదంటే తెలంగాణలో కలపమని డిమాండ్ చేస్తున్నారు అని దళితబంధు మీద తెలిసి తెలియక కొందరు మాట్లాడుతున్నరు అని మండిపడ్డారు. అన్ని వర్గాలకు వరసగా న్యాయం చేస్తాం అన్నారు   సిఎం కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: