చైనా వ్యవహార శైలి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. స్వతంత్ర దేశంగా ఉన్న తైవాన్ తమ దేశం లో భాగంగా మార్చుకునేందుకు ఎన్నో రోజుల నుంచి చైనా చేయని ప్రయత్నమంటూ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తైవాన్ ను వశం చేసుకోవడానికి చైనా ప్రయత్నించడం ప్రపంచ దేశాలు చిన్న దేశమైన తైవాన్ కు అండగా నిలబడడం లాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నో జరిగాయి. అయితే గతంలో అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్  ఉన్న సమయంలో తైవాన్ జోలికి పోకుండా సైలెంటుగా ఉన్న చైనా ఇక ఇప్పుడు మాత్రం రోజు రోజుకి రెచ్చిపోతుంది.  తైవాన్ ను తమ వశం చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా మొదలు పెడుతుంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి పరిస్థితులు ఎక్కడి వరకు దారి తీస్తాయో అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా చైనాకు చెందిన యుద్ధ విమానాలను భారీ సంఖ్యలో అటు తైవాన్ గగనతలం పై తిప్పడం సంచలనంగా మారగా.. దీనిపై అటు అమెరికా అధ్యక్షుడు సైతం స్పందించి తైవాన్ ను ఆక్రమించుకోవడం ఫై  మరోసారి ఆలోచించాలి అంటూ విజ్ఞప్తి చేశాడు.  తైవాన్ ను తమ వశం చేసుకోవడానికి అటు చైనా అన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తైవాన్ ను ఆక్రమించుకోవడానికి ఏకంగా లక్షల 70 వేల మంది సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కూడా మొదలు పెట్టిందట చైనా.  ఈ క్రమంలోనే చైనా అన్నింటినీ సిద్ధం చేసుకుంటుందట. నాలుగు చోట్ల భారీ బృందాలను ఏర్పాటు చేసిందట.


 ఇక చైనా సైనికులు అందరూ తైవాన్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట. అన్ని మార్గాలను ఉపయోగిస్తూ దాదాపుగా ఎనిమిది రకాలుగా ఒక్కసారిగా తైవాన్లోకి చొరబడేందుకు చైనా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.  మొన్నటివరకు తైవాన్ కు అమెరికా అండదండలు ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం..  అమెరికా మద్దతు లేనట్లే కనిపిస్తోంది. దీంతో చైనా తీరు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: