జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌కు కొర‌క‌రాని కొయ్యి మాదిరిగా మారిపోయాడు వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణం రాజు. జ‌గ‌న్ ర‌ఘురామ‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌లేని ప‌రిస్థితి. ర‌ఘురామ ప్ర‌తి రోజు ర‌చ్చ బండ కార్య‌క్ర‌మంతో పాటు ప్రెస్ మీట్లు పెడుతూ జ‌గ‌న్‌ను, వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఓ ఆటాడుకుంటున్నారు. ర‌ఘురామ కు చివ‌ర‌కు వైసీపీ వాళ్లు కౌంట‌ర్లు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి . ఇదిలా ఉంటే ర‌ఘురామ తాజాగా మ‌రో బాంబు పేల్చారు. వైసీపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు.

ఈ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే తాను కూడా వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తాన‌ని పెద్ద బాంబు పేల్చారు. ఈ రోజు ఢిల్లీ లో మీడియాతో మాట్లాడిన ర‌ఘురామ టీఆర్ ఎస్ అధినేత ఎన్నిక కోసం నామినేష‌న్లు దాఖ‌లు అవుతోన్న క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీ సంస్థాగ‌త ఎన్నిక‌ల‌పై కూడా స్పందించారు. వైసీపీ అధ్యక్ష పదవికి ఎన్నిక పెడితే తాను కూడా పోటీ చేస్తానని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌ల వైసీపీ లో సంస్థాగ‌త ఎన్నిక‌లు నిర్వ‌హించిన దాఖ‌లాలు లేవ‌ని... ఈ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే తాను కూడా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీలో ఉంటాన‌ని చెప్పారు.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ విధిగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించ డంతో పాటు ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగానే పార్టీ క‌మిటీల‌ను కూడా ఎన్ను కోవాల్సిన విష‌యాన్ని ర‌ఘురామ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఇక ప్ర‌తి రాజ‌కీయ పార్టీ ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కు ఓ సారి ప్లీన‌రి నిర్వ‌హిస్తూ పార్టీ క‌మిటీల ద్వారా అధ్య‌క్షుడిని ఎన్నుకుంటుంది. అయితే వైసీపీ గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా సంస్థాగ‌త ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ డం లేదు. అందుకే ర‌ఘురామ ఇప్పుడు జ‌గ‌న్‌ను టార్గెట్ గా చేసుకుని ఈ సెటైర్లు వేసిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: