నాన్న‌ను ఆయ‌న జీవితాన్ని మార్చిన పాద‌యాత్ర‌ను మ‌ళ్లీ న‌మ్ముకోవ‌డం వెనుక కార‌ణాలు ఇప్పుడు ఆరా తీయాలి. ఏదేమయినా ష‌ర్మిల చేయ‌బోతున్న పాద‌యాత్ర సాహ‌స‌మనే చెప్పాలి. ధైర్యే సాహ‌సే ష‌ర్మిల అని రాసుకోవాలి. అవునా! కాదా?

రాజ‌కీయంలో మీట‌ర్ కు త‌గ్గ మేట‌ర్ దొర‌క‌దు. దొరికించుకోవాలి. దొర‌పై తిట్ల పురాణం లంకించుకోవాలి. అయితే కేసీఆర్ చెడ్డ‌వాడు అయితే కాదు. ముందున్న పాల‌కుల క‌న్నా బెట‌ర్. తెలంగాణ గురించి ఆయ‌న‌కు తెలిసినంత స‌మ‌గ్రంగా ష‌ర్మిల‌కు తెలియ‌దు. ఆ మాట‌కు వ‌స్తే ఇక్క‌డి సంస్కృతి గురించి అస్స‌లు ఆమెకు ఏమీ తెలియ‌దు అన్న గులాబీ శ్రేణులు విమ‌ర్శించినా అది కూడా నిజ‌మే! ఓ ప్రాంత సంస్కృతిని, భాష‌నూ, ఇతర విష‌యాల‌నూ ప్రేమించ‌కుండా నాయ‌కులు ఎలా అవుతారు. అదే పెద్ద త‌ల‌నొప్పి.


కేసీఆర్ ఈ ప్రాంతం గురించి ఎంతో గొప్ప‌గా మాట్లాడ‌తారు. బ‌తుక‌మ్మ‌ల సంస్కృతిని గురించి చాలా గొప్ప‌గా చెప్ప‌గ‌ల‌రు. నిజ‌మాబాద్ ఊళ్లో ఏ చిన్న సందులో ఏం జరుగుతుందో కూడా చెప్ప‌గ‌ల‌రు. ముఖ్యంగా కులాల స‌మీక‌ర‌ణ‌లు ఆయ‌న‌కు బాగా తెలుసు. మంచి వాడు కేసీఆర్ కొన్ని విష‌యాల్లో! నా తెలంగాణ నా యాస నా భాష అన్న‌వి కేసీఆర్ కు చెల్లినంత‌గా ఆయ‌న ప‌లికించినంత‌గా ఎవ్వ‌రూ ప‌లికించ‌లేరు. ఈ విష‌యంలో ష‌ర్మిల వెనుక‌బ‌డి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని యోజ‌నాల దూరంలో ఉన్నారు. కానీ ఆమె మాట్లాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల మ‌న‌సు గెలిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అన్నీ బాగున్నాయి కానీ ముళ్లు ఉంటాయ్ జాగ్ర‌త్త ! అక్కో!

ప‌ల‌క‌రింపులు..ప‌రామ‌ర్శ‌లు..విమ‌ర్శ‌లు..వీటిలో ఏదో ఒక‌టి ప్ర‌తిరోజూ జ‌రుగుతుంది. జ‌ర‌గ‌కపోయినా పాద‌యాత్ర సాగుతుంది. ఇప్ప‌టిదాకా కేసీఆర్ మరీ! అంత వ‌యెలెంట్ గా తిట్టింది లేదు. అమ్మాయి క‌దా! పెద్ద‌గా బూతులు కూడా మాట్లాడ‌లేదు. ఉన్న మేర‌కు తెలిసిన మేర‌కు మాట్లాడ‌డం ప్రాక్టీసు చేసింది ష‌ర్మిల. వాస్త‌వానికి గ‌తం క‌న్నా భిన్నంగా ఇవాళ తెలంగాణ ఉంది. రాజకీయ శ‌క్తులు ఎవ‌రికి వారు విడిపోయి ఉన్నారు. కోదండ రామ్ లాంటి వారితో ష‌ర్మిల ప‌నిచేయ‌లేదు. అంత సీన్ లేదు ఆమెకు. ఎందుకంటే కోదండ రాం బాగా చ‌దువుకున్న సంస్కారి. కొంత దూకుడు స్వ‌భావం ఉన్న షర్మిల‌కు ఆయ‌న‌కూ అస్స‌లు న‌ప్ప‌దు. ఇలాంటి స‌మ‌యంలో ఎన్నిక‌లకు చాలా దూరం ఉన్న‌ప్ప‌టికీ పాద‌యాత్ర‌లు చేస్తాన‌ని చెబుతోంది ష‌ర్మిల. ఇవ‌న్నీ జ‌నంపై ప్రేమకు సంకేతాలేనా?

మరింత సమాచారం తెలుసుకోండి: