తెలంగాణాలో హుజురాబాద్ ఉపఎన్నిక గట్టి పోటీనే ఇస్తుంది. అధికార పార్టీ నుండి బీజేపీ లో చేరిన అభ్యర్థి ఈటెల, మరోపక్క తెరాస, కాంగ్రెస్ ఇందులో ముందంజలో ఉన్నాయి. ఒక ఉపఎన్నికలో దెబ్బతిన్న కేసీఆర్ ఈసారి ఎలాగైనా గెలవాలనే నిర్ణయించుకున్నాడు. అందుకే కొత్త పధకాన్ని కూడా తెచ్చాడు, అయితే ఆయనే నిధులు లేవు అంటూ ఈ పధకం తేవడంపై విమర్శలు వస్తున్నాయి. దానిని కేవలం ఉపఎన్నిక కోసమే తెచ్చినట్టు కూడా విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ పధకం ఓటర్లను ప్రలోభపెట్టడానికే అనే అంశం పై విపక్షాలు ఆ పధకానికి అడ్డు పడటానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే మొదటి నుండి పరిస్థితులు అన్ని కలిసి వచ్చినందున, ఈ నిర్ణయం కూడా ఆయనకు కలిసే వచ్చేట్టుగా ఉంది.

ఒకటి అమలు చేస్తే ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అమలు లేకపోతే విపక్షాలు అడ్డుపడ్డాయి అనే నెపంతో కూడా ప్రజలు అధికార పార్టీనే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి, కనీసం గెలిచిన తరువాత అది అమలు అవుతుందని వాళ్ళు ఆశపడవచ్చు. అయితే అది నిజంగా అమలు అవుతుందా లేదా అన్నది ఇప్పటి వరకు కేసీఆర్ పనితనం బట్టి చెప్పాలి లేదా నమ్మాలి. ఒకవేళ బీజేపీ ఈ పధకాన్ని అమలు కాకుండా చూసినప్పటికీ, కేసీఆర్ కు కలిసే వస్తుంది. ఎందుకంటే భారీగా ఖర్చుతో కూడుకున్న పధకానికి ఖర్చుపెట్టే పని తప్పుతుంది. అంటే ఆయనకు భారం తగ్గినట్టే కదా.  ఎలా చూసుకున్నా కేసీఆర్ లేదా అధికార పార్టీకి మంచి జరిగే కార్యక్రమం, ఇలానే ఉంటాయి మరి కేసీఆర్ క్రీజులోకి వస్తే.

బీజేపీ గతంలో తెరాస నిద్రావస్థలో ఉన్న సమయంలో వచ్చిన ఉపఎన్నికలో ప్రచారంలో జాతీయనాయకులను దింపినందుకు గెలిచిందో లేక మరో కారణంతో కానీ మొత్తానికి ఒక సీటు అనూహ్యంగా సొంతం చేసుకుంది. అప్పటికి ఒక్కటే కదా అన్న స్వభావంలో ఉన్న తెరాస కు షాక్ ఇచ్చేలా బీజేపీ గొప్ప వ్యూహంతో హుజురాబాద్ సీటు ఖాళీ చేయించగలిగింది. అయితే ఈసారి కేసీఆర్ మేల్కొని, తానే స్వయంగా రంగంలోకి దిగటంతో అంతా మళ్ళీ అధికారపార్టీకి అనుకూలంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: