మంచి స్నేహితులు జీవితాల‌ను తీర్చి దిద్దుతారు. కుటుంబాల‌కు అండ‌గా ఉండి త‌మ ప‌ని తాము చేసుకుని పోతారు. మంచి స్నేహితులు ఇత‌రుల చెడును మ‌రియు ప‌తనాన్ని ఆశించడం జ‌ర‌గ‌ని. అలాంటి స్నేహితులే కొత్త కొత్త ప‌నులు చేస్తుంటారు కూడా! జ‌నంకు చేరువ అయ్యేందుకు రాజ‌కీయాల్లో కూడా అలాంటి స్నేహితులు అరుదు. అవ‌స‌రార్థం స్నేహాలు, అవ‌స‌రార్థం ప్రేమ‌లు ఉన్న ఈ రోజుల్లో మంచి స్నేహితులు అప్పుడ‌ప్పుడూ వైఎస్ - కేవీపీ రూపాల్లో  క‌నిపిస్తారు. కానీ వారి బిడ్డ‌లే ఆ స్నేహాన్ని కొన‌సాగించ‌లేక‌పోతున్నారు.


రాజ‌కీయాల్లో చాలా మంది మిత్రులు విడిపోతుంటారు. కొంద‌రు మాత్రం చివ‌రిదాకా తోడుంటారు. అలాంటి మిత్రులు కేవీపీ - వైఎస్. వైఎస్ త‌న క‌న్నా సీనియ‌ర్ చ‌దువుల్లో! ఆయ‌న వాళ్లిద్ద‌రూ మంచి ఫ్రెండ్స్. ఒకే ద‌గ్గ‌ర చ‌దువుకుని ఎదిగి వ‌చ్చిన వాళ్లు. వైఎస్ ఆత్మ కేవీపీ అని ఎవ్వ‌రు అన్నా అది నిజం. కానీ ఈ విష‌యం కేవీపీ ఒప్పుకోరు. తాను కేవ‌లం వ్యూహాలు మాత్రం సిద్ధం చేసేవాణ్ని అని వాటి అమ‌లు, వాటిలో మంచి లేదా చెడు అన్న‌ది ఆయ‌నే నిర్ణ‌యించుకునేవార‌ని చెబుతారు కేవీపీ. రాష్ట్రం విడిపోయాక జ‌గ‌న్ సీఎం అయ్యాక కూడా కేవీపీ త‌న పంథాను మార్చుకోలేదు.


కాంగ్రెస్ ను న‌మ్ముకునే ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ కు ప‌నిచేస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు మ‌రో పార్టీ తెర‌పైకి వ‌చ్చింది. వైఎస్సార్టీపీ పేరిట ష‌ర్మిల ప్రారంభించిన పార్టీకి కేవీపీ సేవ‌లు అందిస్తే బాగుండు అన్న ఆలోచ‌న ఒక‌టి ఎప్ప‌టి నుంచో వ‌స్తోంది. కేవీపీ మాత్రం అందుకు సిద్ధంగా లేర‌నే తెలుస్తోంది. పాత స్నేహాలు పున‌రుద్ధ‌రించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న ష‌ర్మిల‌కు ఓ విధంగా ఇది ఆశాభంగ‌మే!


ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా వాటిపై మాట్లాడేందుకు కేవీపీపై పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేదు.కాంగ్రెస్ ప‌రిణామాలు కూడా ఆయ‌న‌కు న‌చ్చ‌డం లేదు. రేవంత్ ను పీసీసీ చీఫ్ గా నియ‌మించ‌డంపై కూడా పెద్ద‌గా ఆయ‌న‌కు అంగీకారం లేదు కానీ అధిష్టానం నిర్ణ‌యించాక తానేం మాట్లాడ‌తాన‌ని చెప్పి ఊరుకున్నారు. కానీ ఇప్పుడు ష‌ర్మిల నుంచి అటువంటి ప్ర‌పోజల్ వ‌స్తే బాగుంటుంది అని చాలా మంది అంటున్నారు. ష‌ర్మిల మాత్రం అడిగేందుకు సందేహిస్తున్నారు. సంశయాత్మ‌క  ధోర‌ణిలో ఉండిపోతున్నారు. ఆయ‌న ఇటుగా వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తేల్చేశారు కూడా!
కానీ కేవీపీని మించిన వ్యూహ‌క‌ర్త ఎవ్వ‌రూ లేర‌న్న సంగ‌తి ష‌ర్మిల కూడా ఒప్పుకుంటున్నారు. తానిప్పుడు ప్ర‌శాంత్ కిశోర్ అనే  
స్ట్రాట‌జిస్టుతో ప‌నిచేయాల‌ని చూస్తున్నాన‌ని అన్నారు. అదేవిధంగా భ‌విష్య‌త్ లో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుంటాన‌ని కూడా
అంటున్నారు. ఏమో అన్నా! ఏదీ ఇప్పుడే చెప్ప‌లేనను అన్న స‌మాధానమే ఇచ్చి వెళ్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: