హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆరెఎస్ లో చాలా మార్పులోస్తాయని మరో బాంబు పేల్చారు రేవంత్‌ రెడ్డి. విజయ గర్జన సభ.. తిరుగుబాటును ఎదుర్కోడానికే.. కేసీఆర్.. భయంతోనే వున్నారు.. దాన్ని బయటపడకుండా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు రేవంత్‌.  ముందస్తు రాదని కేసీఆర్.. చెప్పడం హాస్యాస్పదంగా వుందని... పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కలిసి రావన్నారు. 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని... ప్లీనరీ, విజయ గర్జన సభ .. భయంలోనే పెడ్తుండు...ఇవే టీఆరెఎస్ పార్టీకి చివరి సభలు అని చురకలు అంటించారు.. 

హరీష్ రావు ను కూడా త్వరలో పార్టీ నుండి బయటికి పంపుతాడని... మిత్ర ద్రోహి పేరుతో.. స్మశాన వాటికకు పంపుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్‌ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికల తర్వాత పార్టీలో తిరుగుబాటు వస్తదని.. ఈటెల గెలిచిన ఓడిన ఎవరికి లాభం లేదని చెప్పారు రేవంత్‌.. గుజరాత్ తోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయని.. 2022 ఆగస్ట్ 15 తో.. 75 ఏళ్లు పూర్తవుతుంది మనకు స్వాతంత్య్రం వచ్చి... ఆ సందర్భంగా.. కొత్త శకానికి నాంది అని కేసీఆర్.. ఎన్నికలకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్‌. మోడీ డైరెక్షన్ లో కేసీఆర్.. గుజరాత్ తో..ఎన్నికలలో వెళ్తారని... రాష్ట్రంలో బిజేపి ని బలోపేతం చేసే.. కుట్ర జరుగుతోందన్నారు.

ముందస్తు ఎన్నికలు అంటే.. పార్టీలో మరింత గందరగోళం వస్తదని.. చెప్పడం లేదని.. ప్రతి నియోజక వర్గంలో నాయకులకు టికెట్ల ఇచ్చే పరిస్తితి లేదు. కాబట్టి వారిని ముందస్తుగానే అలర్ట్ కాకుండా ఈ డ్రామాలు మండిపడ్డారు.  ఎవరు అడిగారు.. ముందస్తు ఎన్నికల విషయం.. ముందస్తుపై మాట్లాడానికి.. మరో రెండేళ్లు నా సర్కార్ అధికారంలో వుందని.. చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.  విజయ గర్జన ఎందుకు.. ఏం సాధించాడని. ఎంపీలు 16 గెలుస్తా.. కేంద్రంలో చక్రం తిప్పుతా.. అంటే దేనికి సంకేతమని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: