ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు అనేవి పెరుగుతూనే ఉన్నా సరే పోలీసులు వాటిని అదుపు చేయడం లో ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సైబర్ నేరాల విషయంలో ఈ మధ్య కాలంలో కాస్త ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు సికింద్రాబాద్ లో ఒక దారుణ మోసాన్ని బయటకు తీసారు. సికింద్రాబాద్ కేంద్రంగా గా అమెరికా ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశస్థులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోసగాళ్ళు సినిమా తరహాలో విదేశీయులను టార్గెట్ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇన్కమ్ టాక్స్, రెవెన్యూ అధికారుల పేర్లతో అయా దేశస్థులకు ఫోన్ లు  చేస్తున్నారు అని గుర్తించారు. సికింద్రాబాద్ లో ఒక నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ముఠా... టాక్స్ చెల్లింపులు సక్రమంగా చేయటం లేదని పెనాల్టీ విధిస్తామని ఫోన్ లో హెచ్చరికలు చేయడం గమనార్హం. అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాలలో పెనాల్టీ ఫీజులు అధికంగా ఉండటంతో సెటిల్ చేసుకోవాలని నిందితుల ఆఫర్ కూడా పోలీసులను ఆశ్చర్యపరిచిది. దీంతో లక్షల్లో నిందితులకు చెల్లిస్తున్న ఆయా దేశస్తులు... కనీసం నిజమా కాదా అనేది కూడా ఆలోచించలేదు.

కొంత డబ్బు హవాలా రూపంలో, మరి కొంత  మంది క్రిప్టో కరెన్సీ రూపములో  సైతం నిందితులకు చేర్చడం గమనార్హం.  సికింద్రాబాద్ కాల్ సెంటర్ వ్యవహారంపై అమెరికన్ కాన్సులేట్ కు సమాచారం కూడా వెళ్ళగా వీరి మాటల పై అనుమానంతో పై అమెరికన్ కాన్సులేట్ కు పలు ఫిర్యాదు లు వెళ్ళాయి. అమెరికన్ కాన్సులేట్ అధికారులు ఇచ్చిన సమాచారం తో రంగంలోకి దిగిన బేగంపేట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు... ఇప్పటికే వందల మంది నుండి కోట్లలో రాబట్టిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు... టెలీకాలర్ లతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం కేసును సిసిఎస్ కు బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: