తెలంగాణాలో హుజూరాబాద్ ఎన్నిక నేపధ్యంలో దళిత బంధు అనే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి మనకు తెలిసిందే. హుజూరాబాద్ లో ఎలా అయినా సరే గెలవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్న నేపధ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేసింది. కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో విపక్షాలు అన్నీ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేసాయి. హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ కార్యక్రమం అని అందుకే కోకాపేట భూములు కూడా అమ్మేసారు అని ఆరోపణలు వచ్చాయి.

ఇక ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దళిత బందుకి సంబంధించి ఆపాలి అని ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ లేఖ వలనే దళితబంధు నిలిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. దళితబంధు పథకం అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటోన్న బీజేపీ... ఈనెల 7న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బదిలీ చేయాలని లేఖలో బీజేపీ ప్రధాన‌ కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. దళిత బంధు లబ్ధిదారులను గుర్తించినప్పటికీ వాళ్ళ ఖాతాలో కావాలనే నగదు జమ చేయటం లేదు అని ఆరోపించారు.

ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు దళితబంధు నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని అధికార పార్టీ  ప్రయత్నాలు చేస్తోంది అని ఆయన లేఖలో వివరించారు. దళిత బంధు విషయంలో అధికార పార్టీకి లబ్ధి చేకూరే విధంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నాడు  అని ఆయన లేఖలో వివరించారు. అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసినా నిధులను ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ హోల్డ్ చేశారు అని పేర్కొన్నారు. అక్టోబర్ 7న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: