రాజ‌కీయాల్లో ఒక్కొక్క‌సారి కార్యాకార‌ణ సంబంధాలు క‌నిపిస్తుంటాయి. అంటే.. ఒక‌దానికి ఒక‌దానికి సంబంధం లేక‌పోయినా.. ఫ‌లితం మాత్రం పాజిటివ్‌గా ఉంటుంది. ఇదే.. కార్యాకార‌ణ సంబంధం. ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యే, చంద్ర‌బాబుకు సాక్షాత్తూ వియ్యంకుడు.. నంద‌మూరి బాల‌కృష్ణ వ్య‌వ‌హారం.. ఆ పార్టీలో కీల‌క చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. చంద్ర‌బాబును పైకి మెచ్చుకుంటూనే.. కొన్ని వ‌ర్గాల నాయ‌కులు.. లోలోన అంత‌ర్గ‌త ఒప్పందాలు చేసుకుని.. పార్టీని డైల్యూట్ చేస్తున్నారు. ఇలాంటి వారి విష‌యంలో చంద్ర‌బాబు  ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిక‌లు చేస్తున్నా.. ఫ‌లితం క‌నిపించ‌డం లేదు.

ఇప్పుడు ఇలాంటివారిపై బాల‌య్య‌ను ప్ర‌యోగించ‌డం ద్వారా.. దారికి తెచ్చుకోవాల‌ని అంటున్నారు సీనియ‌ర్లు. అదెలా.. అంటే.. ఇటీవ‌ల మూవీ ఆర్టిస్ట్స్ అసొసియేష‌న్.. మా ఎన్నిక‌లు జ‌రిగాయి. దీనికి సంబంధించి ఎంత ర‌గ‌డ జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో సైలెంట్‌గా చ‌క్రం తిప్పిన వారిలో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఉన్నార‌ని.. తాజాగా వెలుగు చూసిన విష‌యం. మంచు విష్ణుకు అనుకూలంగా బాల‌య్య బాహాటంగానే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కూడా కొంద‌రికి స్వ‌యంగా ఫోన్లు చేశార‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో త‌ట‌స్థ ఓటు బ్యాంకు పూర్తిగా విష్ణుకు అనుకూలంగా మారింద‌ని అంటున్నారు. ఇదే విష్ణు గెలుపున‌కు కార‌ణంగా మారింది.

సో.. బాల‌య్య వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగులు.. సినీ ఫీల్డ్‌లోనే ప‌నిచేసిన నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల విష‌యంలో బాల‌య్య కొంత దూకుడుగా ఉంటే.. టీడీపీ కూడా అధికారంలోకి వ‌స్తుంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. అంటే.. చంద్ర‌బాబు లౌక్యంగా చేయ‌లేని ప‌నిని బాల‌య్య సాధించ‌డం తేలిక‌గా జ‌రుగుతుంద‌ని.. ఆయ‌న‌పై ఉన్న గౌర‌వంతో కావొచ్చు.. లేదా భ‌యంతో కావొచ్చు.. ఎలా చూసుకున్నా.. బాల‌య్య‌తో మార్పు ఖాయ‌మ‌నే వాద‌న మాత్రం వినిపిస్తోంది.

అయితే.. దీని వ‌ల్ల చంద్ర‌బాబుకు వ‌చ్చిన న‌ష్టం ఏమీ ఉండ‌ద‌ని కూడా చెబుతున్నారు. త‌న‌వైపు చూడ‌ని నాయ‌కుల‌ను.. త‌నంటే.. వినీ వినిపించుకోని నాయ‌కుల‌ను .. కూడా లైన్‌లో పెట్టేందుకు బాల‌య్య ఫార్ముల‌ను వినియోగించుకుంటే.. బాబుకు బెస్ట్ డోస్‌లాగా ప‌నిచేస్తుంద‌ని అంటున్నారు. మ‌రి బాబు ఆదిశ‌గా దృష్టి పెడ‌తారా?   లేదా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: