ఏపీ లో అధికార వైసీపీలో విభేదాలు ప్ర‌తిప‌క్ష‌ తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చేలా ఉన్నాయి. అనేక నియోజకవర్గాలలో వైసీపీ నేత‌ల మ‌ధ్య బయట‌పడుతున్నగొడ‌వ‌లు అటూ ఇటూ తిరిగి చివ‌ర‌కు విప‌క్ష‌ టీడీపీకి అనుకూలంగా మారుతున్నా యి. స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ సొమ్ము చేసుకుంటే ఆ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల‌లో సులువుగా గెలిచే ప‌రిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు విశాఖ జిల్లా లోని ఏజెన్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన పాడేరు నియోజకవర్గంలో పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడ టీడీపీ నేత , మాజీ ఎమ్మె ల్యే గిడ్డి ఈశ్వరికి మంచి రోజులొస్తున్నాయన్న సంకేతాలు మ‌న‌కు క్లీయ‌ర్ గా క‌నిపిస్తున్నాయి.

పాడేరులో వైసీపీకి గ‌ట్టి ప‌ట్టు ఉంది. 2014 లోనే అక్క‌డ ఆ పార్టీ నుంచి గిడ్డి ఈశ్వ‌రి బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించారు. త‌ర్వాత ఆమె టీడీపీ లోకి వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల‌లో ఆమె టీడీపీ నుంచే పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో జ‌గ‌న్ అక్క‌డ‌ భాగ్యలక్ష్మిని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టడంతో తిరిగి గెలుచుకుంది. అయితే భాగ్యలక్ష్మి పై ఇప్పుడు సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవు తుండ‌డంతో పాటు వారంతా ఆమె కు సీటు ఇస్తే తాము చిత్తుగా ఓడిస్తామ‌ని ఫైర్ అవుతున్నారు.

ఇక ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎమ్మెల్యే ప‌రువు తీసేశాయి. ఈ ఎన్నికల్లోనియోజ‌క‌వ‌ర్గంలో ని పాడేరు, చింతపల్లి, మాడుగుల జడ్పీటీసీలు వైసీ పీ రెబల్స్ గెల‌వ‌డం ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చే అంశంగానే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే ఈశ్వ‌రి ఈ రెబ‌ల్స్ జ‌డ్పీ టీసీ ల‌తో పాటు ఎమ్మెల్యే వ్య‌తిరేక వ‌ర్గాన్ని త‌న వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. వీరు స‌పోర్ట్ చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ కంచుకోట‌లో ఈశ్వ‌రి గెలుపు ఖాయ‌మే.. అదే పార్టీ కూడా అధికారంలోకి వ‌స్తే ఎస్టీ మ‌హిళా కోటాలో ఆమెకు మంత్రి ప‌ద‌వి ఛాన్స్ కూడా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: