ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దేవాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు కొన్ని రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు దేవాలయాలకు సంబంధించి భూముల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. అభ్యంతరాలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా చూడటానికి రెడీ అవుతున్నారు. ఆలయాల విషయంలో భక్తుల నుంచి వచ్చే అభ్యంతరాలను చాలా సీరియస్ గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్దం అవుతుంది.

తాజాగా... ఏపీ ఆలయాలకు చెందిన భూములుకు ఎన్వోసీ ఇచ్చేందుకు సిధ్ధం అయిన దేవాదాయశాఖ అధికారులు... మొన్నటి వరకు దేవాదాయశాఖ మంత్రి వద్ద పనిచేయిన ఉద్యోగుల హస్తంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. వివిధ ఆలయాల భూములకు ఎన్వోసీల జారీ విషయంలో ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రతి ఎన్వోసీని పరిశీలించేలా ఓ త్రి సభ్య కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

దేవాదాయశాఖ కమిషనరేట్‌ స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన, ఇతర ఆలయాలకు సంబంధించి సుమారు 24 లక్షల ఆడిట్‌ అభ్యంతరాలు ఉండగా వాటి మీద ఫోకస్ చేసింది. వీటి విలువ రూ.951 కోట్లుగా అంచాన వేసింది ఏపీ ప్రభుత్వం.  శ్రీకాళహస్తిలో రూ.159 కోట్లు, కాణిపాకంలో రూ.122 కోట్లు, దుర్గగుడిలో రూ.110 కోట్లు, అన్నవరం ఆలయంలో రూ.70 కోట్ల ఖర్చుపై భక్తుల నుంచి అభ్యంతరాలు ఉన్నట్టు గుర్తించింది.

ఆయా అభ్యంతరాలు వచ్చిన సమయంలో ఈవోగా ఎవరైతే ఉన్నారో వారినే బాధ్యులను చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆలయాల భూములు, ఖాళీ స్థలాలు, దుకాణాల లీజుకు సంబంధించి బకాయిలు 110 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. మూడు నెలల్లో వీటిని చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వాలని  ఆదేశాలు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: