జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ప్ర‌ధానంగా క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ గా చేసుకుంటూ వస్తున్నారంటూ ఆ వ‌ర్గం వారిలో విమ‌ర్శ‌లు కాస్త ఎక్కువ గానే ఉన్నాయి. ఎందు కంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ వ‌ర్గం వారి ని రాజ‌కీయంగాను, ఆర్థికంగానే బాగా టార్గెట్ గా చేస్తోంద‌న్న చ‌ర్చ‌లు కూడా ఉన్నాయి. ప్ర‌తి సారి జ‌గ‌న్ కూడా త‌న ప్ర‌సంగాల్లో క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్ర‌స్తావ‌న తెస్తూనే ఉన్నారు. అయితే ఆయ‌న కేబినెట్లో కేవ‌లం కొడాలి నాని మాత్ర‌మే క‌మ్మ వ‌ర్గం నుంచి మంత్రి గా ఉన్నారు. ఇక వైసీపీ నుంచి కేవ‌లం ఆరుగురు ఎమ్మెల్యే లు మాత్ర‌మే క‌మ్మ‌లు ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క క‌మ్మ ఎమ్మెల్సీ కూడా ఈ వ‌ర్గం లో పార్టీ త‌ర‌పున లేరు.

అయితే జ‌గ‌న్ గ‌త ఎన్నిక ల‌కు ముందే ఇదే వ‌ర్గానికి చెందిన చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌శేఖ‌ర్ కు ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌లేదు. ఇక త్వ‌ర‌లోనే వైసీపీ త‌ర‌పున 14 మంది కొత్త ఎమ్మెల్సీలు ఎన్నిక కానున్నారు. ఇందులో ఏకంగా ముగ్గురు క‌మ్మ నేత‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో గుంటూరు జిల్లా నుంచి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పేరు వినిపిస్తోంది.

ఆయ‌న‌కు మంత్రి ఇవ్వాలంటే ముందుగా ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఇక కృష్ణా జిల్లా నుంచి గ‌త ఎన్ని క‌ల‌లో గ‌న్న‌వ‌రం లో వంశీ పై ఎమ్మెల్యే గా పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు పేరు కూడా లైన్లో ఉంది. రాజ‌ధాని జిల్లా లు అయిన ఈ రెండు జిల్లాల నుంచి ఈ ఇద్ద‌రికి ఎమ్మెల్సీ రావ‌చ్చ‌ని అంటున్నారు. ఇక ప్ర‌కాశం నుంచి కూడా ఇద్ద‌రు క‌మ్మ నేత‌లు లైన్లో ఉన్నారు. వీరిలో ప‌రుచూరులో 2014లో పోటీ చేసి ఓడిన గొట్టిపాటి భ‌ర‌త్ తో పాటు కందుకూరు కు కొంత కాలం ఇన్‌చార్జ్ గా ఉన్న తూమాటి మాధ‌వ రావు పేర్లు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: