తెలంగాణలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి వార్తలు కాస్త ఎక్కువగా వస్తూ ఉంటాయి. జగ్గారెడ్డి ఏది చేసినా ఏదీ చేయకపోయినా సంచలనం గానే ఉంటుంది. ప్రజల్లో జగ్గారెడ్డి కొంత ఆదరణ చూసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇబ్బందిపడుతూ ఉంటారని అందుకే ఆయనను పక్కన పెట్టడానికి కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనే వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉంటాం. రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతున్నారు సరే 2018 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరిగే నాయకుడిగా ఆయనకు తెలంగాణలో మంచి గుర్తింపు కూడా ఉంది.

రాజకీయంగా పదవుల విషయంలో పెద్దగా కక్కుర్తి పడని జగ్గారెడ్డి కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం కాస్త దూకుడుగా ముందుకు వెళుతూ ఉంటారు. తనను నమ్ముకున్న వాళ్ళను అలాగే తాను నమ్ముకున్న వాళ్ళను కాపాడుకునే విషయంలో జగ్గారెడ్డి ముందు వరుసలో ఉంటారు. మాజీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి విషయంలో ఒక్క మాట కూడా ఎవరినీ అననిచ్చేవాళ్ళు కాదు జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రం ఆయన కాస్త దూకుడుగా విమర్శలు చేయడం మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం.

రేవంత్ రెడ్డి కొన్ని కొన్ని విషయాల్లో ఆయనను కూడా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఆ పార్టీకి దూరంగా ఉండాలని భావించి కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆయన చర్చలు జరిపారని వార్తలు వినిపించాయి. అయితే జగ్గా రెడ్డి గురించి తెలిసిన ఒక సీనియర్ జర్నలిస్టు కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి రాజకీయం తెలిసిన మనిషని టీఆర్ఎస్ పార్టీలోకి వెళితే తనకు ప్రాధాన్యత ఉండదని అలాగే బీజేపీ లోకి వెళ్ళిన సంగతి పట్టించుకునే అవకాశం ఉండదని కాంగ్రెస్ పార్టీలోనే తనకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని అందుకే ఆయన పార్టీ మారే అవకాశం లేదని స్పష్టం చేశారు సదరు సీనియర్ జర్నలిస్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts