ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సోద‌రి, వైఎస్ ష‌ర్మిల కేవలం తెలంగాణ రాజ‌కీయాల‌నే కాకుండా ఏపీ రాజ‌కీయాల‌ను కూడా టార్గెట్ చేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఆమెకు అన్న జ‌గ‌న్ తో విబేధాలు ఉన్నాయి. అయితే ష‌ర్మిల డైరెక్టుగా ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌కుండా ముందుగా తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్క‌డ నుంచి అన్న‌ను టార్గెట్  చేసే ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ష‌ర్మిల‌కు త‌ల్లి వైఎస్‌. విజ‌య‌ల‌క్ష్మి మ‌ద్ద‌తు కూడా పుష్క‌లంగానే ఉంది. ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుంచి ఆ త‌ర్వాత అన్ని విష‌యాల్లోనూ విజ‌య‌ల‌క్ష్మి కుమార్తెకు స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్నారు.

అయితే ష‌ర్మిల తెలంగాణ ఎన్నిక‌ల‌లో ఎలాగూ పోటీ చేయ‌డం ఖాయ‌మైంది. అయితే ఆ త‌ర్వాత జ‌రిగే ఏపీ ఎన్నిక‌ల్లోనూ ష‌ర్మిల పార్టీ పోటీ చేస్తుంద‌ని అంటున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాక‌పోయినా వైఎస్ అభిమానులు ఎక్కువు ఉన్న రాయ‌ల‌సీమ లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల తో పాటు ఏపీ లో బ్ర‌ద‌ర్ అనిల్ ద్వారా ఉన్న ఓటు బ్యాంకు ఎక్కువుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే ష‌ర్మిల పార్టీ పోటీ చేసేలా తెర వెన‌క పెద్ద ప్లానింగే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. ఇందుకు కేవీపీ రామ చంద్ర‌రావు మంత్రాంగం కూడా ఉంద‌ని టాక్ వ‌స్తోంది.

ప్ర‌స్తుతం ష‌ర్మిల తెలంగాణ‌లో తండ్రికి క‌లిసి వ‌చ్చిన చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపడుతున్నానని  షెడ్యూల్ కూడా ప్రకటించారు. వైఎస్ఆర్‌టీపీని ప్రకటించే సమయంలో ఆమె పాద‌యాత్ర చేస్తాన‌ని చెప్పారు. తెలంగాణ ఎన్నిక‌ల‌లో స‌త్తా చాటుకున్నాక త‌ర్వాత ఏపీ లో కూడా ప‌ట్టున్న ప్రాంతాల్లో పోటీ చేసి ఇక్క‌డ కూడా అన్న‌కు త‌న స‌త్తా ఏంటో చాటి చెప్పాల‌న్న‌దే ష‌ర్మిల ప్లాన్ గా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మిని పోటీ లోకి దింపుతార‌ని ఓ ప్ర‌చారం అయితే ఉంది.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ ఫ్యామిలీ కి పార్టీల‌తో సంబంధం లేకుండా 25 నుంచి 30 వేల ఓటు బ్యాంకు ఉంది. అక్క‌డ విజ‌య‌మ్మ పోటీ చేస్తే వైఎస్ సెంటిమెంట్ ప‌ని చేసి ఆ జిల్లా అంత‌టా ప్ర‌భావం చూపుతుంది. ఏదేమైనా ష‌ర్మిల ప్లాన్లు అయితే మామూలుగా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: