ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా కష్టపడుతూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి గాను కొన్ని పదవులను ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా ప్రకటిస్తూ వస్తున్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తలు అవసరం గుర్తించిన చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని విషయాల్లో కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అదేవిధంగా సోషల్ మీడియాలో చాలా ఉత్సాహంగా ఉండే కార్యకర్తలను గుర్తించి ముందుకు నడిపించేందుకు ఇటీవల కొన్ని పదవులను ప్రకటించారు. పార్టీలో కొత్త విభాగాన్ని కూడా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చి పదవులు ఇవ్వడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే itdp పేరుతో తెలుగుదేశం పార్టీ పదవులను ఎక్కువగా ఇస్తోంది. ఇప్పుడు ఈ పదవులు కార్యకర్తలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతున్నాయి. చాలా మంది కార్యకర్తలు దీనికి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి అలాగే నియోజకవర్గాల కార్యదర్శుల పదవులను ఆశించారు. ఫేస్బుక్ లో దాదాపు పదేళ్ల నుంచి యాక్టివ్ గా ఉంటున్న కొంతమంది కార్యకర్తలు ఈ పదవుల విషయంలో సీరియస్ గానే ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న సోషల్ మీడియాలోకి వచ్చిన వాళ్లకు చంద్రబాబు పదవి ఇచ్చారని కొంత మంది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ కోసం తాము గట్టిగా కష్టపడిన కేసులు ఎదుర్కొంటున్న సరే తమను గుర్తించడం లేదని ఆవేదన చాలా మంది కార్యకర్తలతో ఉంది అని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. రాజకీయంగా పార్టీ విషయంలో చంద్రబాబు నాయుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటిది కొంత మంది కార్యకర్తలను గుర్తించే క్రమంలో మరికొంతమందికి అన్యాయం జరుగుతుందనే విమర్శలను చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు. ఈ పదవులు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది కార్యకర్తలు తమ ఫేస్బుక్ ఖాతాలో మూసేసుకుని వెళ్లిపోయారని విమర్శలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp