గత కొన్ని నెలల నుంచి భారత్ చైనా సరిహద్దు లో ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  నిషేధిత భూభాగంలోకి వచ్చి గుడారాలు ఏర్పాటు చేస్తున్న చైనా సరిహద్దుల్లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. అటు భారత ఆర్మీ కూడా చైనాకు దీటుగా బదులిస్తూ నిలబడింది. అయితే భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం విషయంలో ఎన్నో సార్లు చర్చలు జరిగాయి. పలుమార్లు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి ఇరుదేశాలు. కానీ చైనా మాత్రం ఎప్పటికప్పుడు ఒప్పందాలను ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తూనే ఉంది. ఇక ఇటీవల కాలంలో మరోసారి సరిహద్దులో చైనా వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారిపోతుంది అనే చెప్పాలి.



 మరోసారి భారత్ చైనా సరిహద్దు వెంట చైనా వ్యవహార శైలి కాస్త రెచ్చగొట్టే విధంగానే మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటికే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కార్యకలాపాల కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తూర్పు విభాగంలో చైనా శిక్షణా వ్యాయామాల స్థాయిని పెంచింది. పెట్రోలింగ్ పెరుగుదల కారణంగా తూర్పు లడక్ సెక్టర్ లోని కొన్ని ప్రాంతాలలో వాతావరణం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలే సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై ఇండియన్ ఆర్మీకి చెందిన తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడారు. చైనా ఇంటిగ్రేటెడ్ జాయింట్ ఆపరేషన్ వ్యాయామాలను చేపడుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సాయుధ దళాల యొక్క వివిధ అంశాలు ఒకచోట చేర్చుకుంటున్నారని తెలిపారు.



 నిఘా నివేదికల ఆధారంగా చైనీస్ కార్యకలాపాలను అంచనా వేస్తున్నట్లు తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే చెప్పుకొచ్చారు. లోతు ప్రాంతాలలో అటు చైనా వ్యాయామాల శిక్షణ మరింత పెరుగుతుందని గుర్తించామని తెలిపారు. అంతేకాకుండా రిజర్వుడు నిర్మాణాలు కూడా శిక్షణ ప్రాంతాల్లో చైనా కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. అదే సమయంలో అధునాతనమైన నిఘా డ్రోన్ లు రాడార్లు మరియు నైట్ విజన్ సామర్థ్యాల  ప్రేరణతో ఇక భారత సైన్యం కూడా నిఘా గ్రిడ్ ను ఎంతగానో వేగవంతం చేసింది అంటూ ఆయన తెలిపారు. ఇక భారత్ ఏర్పాటు చేసిన ఈ నిఘా గ్రిడ్  చైనా కార్యకలాపాలను  ఖచ్చితత్వంతో గుర్తిస్తాయి అని తెలిపారు   అంతేకాదు సరిహద్దులో చైనా తమ సైనికుల సంఖ్యను కూడా పెంచుతుంది అంటూ తెలిపారు. ఇలా చైనా తీరు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని తీసుకువస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: