దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈసారి కూడా గెలిచి నిరూపించుకోకపోతే ఇక ప్రాంతీయ పార్టీ కంటే దైన్యంగా తయారయ్యే పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకే మోడీ పై ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతకు ధీటుగా ఉన్న నేతను ఆ పార్టీ ప్రజల ముందుకు తెచ్చేందుకు సిద్ధం అవుతుంది. అందుకు ఇప్పటికే రాహుల్ పనికిరాదని అందరికి అర్ధం అవడంతో, ఇక ఉన్న ఒకేఒకరు ప్రియాంక. ఇప్పటికే అప్పుడప్పుడు పార్టీ కోసం ఆమె కనీసం రాహుల్ కంటే కాస్త మెరుగ్గానే పని చేసింది అని అనిపించుకుంది. దీనితో ఆమె కు అదేదో సినిమాలో చేసినట్టుగా ఇందిరలా కనిపించాలని ఆవిధంగా ప్రియాంకను తయారు చేశారు. అంటే ఆమెను చుసిన వారికి ఇందిరా గాంధీ జ్ఞాపకానికి వస్తే, ఆ తరం వారు ఓట్లు గుద్దేస్తారనేది వాళ్ళ నమ్మకం. అంత సులభం ఏమి కాకపోయినా ఒక్కఓటు కూడా విజయం వైపు నడిపిస్తుంది అన్నప్పుడు ప్రయత్నం చేయడంలో తప్పేముంది అన్నది వారి అభిమతం కావచ్చు.

రాహుల్ ని మాత్రం పక్కన పెట్టేందుకే మొగ్గుచూపుతున్నారు వ్యూహకర్తలు. కానీ అందుకు సోనియా మాత్రం సిద్ధంగా ఉన్నట్టేమీ కనిపించడం లేదు. అయినా పార్టీ భవితవ్యం కోసం ఈ త్యాగం తప్పదు అంటున్నారు. పార్టీ కోసమైనా సోనియా పట్టు వదిలే అవకాశాలు లేకపోలేదు. అయితే మరి ఇందిరా గాంధీ లాగ ప్రాజెక్ట్ చేస్తున్న ప్రియాంక కు ఓట్లు పడతాయా, ఆమె పార్టీని ఈసారి నిలబెట్టగలడా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎన్నికలకు మరో రెండు ఏళ్ళు, ముందస్తు వచ్చినప్పటికీ కనీసం ఏడాది ఉంది, అంతలో ఈ ఇందిరమ్మ తన చాతుర్యంతో ప్రజలను తన ఓట్లర్లుగా మార్చుకోగలదా అనేది చూడాల్సి ఉంది. కాస్త ప్రయత్నిస్తే అవకాశాలు ఎంతోకంత ఉండొచ్చు అనేది పార్టీ వర్గాల  ఆశాభావం.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ పై ఇందిరా గాంధీ తరహా ప్రియాంక లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ ప్రియాంక విజయం సాధిస్తే, సంకీర్ణం వచ్చినట్టే, అంటే కాంగ్రెస్ గట్టెక్కినట్టే అనేది వ్యూహం. ఇందిరా గాంధీ చేసిన రాజకీయాలు కూడా అమలులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ ప్రియాంక ఒంటరిగా పోటీకి దిగటానికి సిద్ధం అవుతుందట. ముందస్తు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిచాలని కోరినప్పటికీ, గెలిచిన తరువాత చూద్దాం అని సోనియా అన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ చీలిక అనే అంశం ఇక్కడ బాగా ప్రాజెక్ట్ అవుతుంది, దానితో మోడీ గురించి చర్చ లు దీనిపై మళ్ళి, కాస్త వాళ్లకు అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాళ్ళ అంచనా. అయినా నిజంగా మోడీని ఢీకొట్టే నేతగా ప్రియాంకా గాంధి ప్రజలలో పేరుతెచ్చుకోవాల్సి ఉంటుంది, అప్పుడే ఈ వ్యూహాలన్నీ ఫలించడానికి అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: