చైనా తన దేశం లో ఉన్న సంక్షోభాన్ని మరియు వాతావరణ అననుకూలతలను బట్టి ప్రజలలో పెరిగిపోతున్న ప్రభుత్వ వ్యతిరేకతను ద్రుష్టి మళ్లించడానికి భారత్ పై రెచ్చగొట్టే వ్యూహాలు పన్నుతోంది. ఎవరైనా భారత్ పై యుద్దానికి ఒక అడుగు ముందుకు వేస్తె చాలు, ఆ పేరుచెప్పుకొని తాను విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నట్టే ప్రవర్తిస్తుంది. అంతేకాని ధైర్యంగా తనుమాత్రం ముందుకు అడుగు వేయడం లేదు. ఎప్పుడు ఎవడి వెనకాలో దాక్కుంటూ బ్రతికేస్తున్న చైనా మరోసారి కూడా అదే పంధాలో వ్యూహాలు రచిస్తుంది. తాజాగా భారత్ కు కేవలం రెండు వందల కిలోమీటర్ల దూరంలో మానవరహిత జెట్ లతో చక్కర్లు కొడుతోంది. దానిని భారత సరిహద్దు దళాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. కేవలం ఇదంతా రెచ్చగొట్టే చర్యలు తప్ప మరొకటి కాదని నిపుణులు అంటున్నారు.

మొన్నమొన్నటిదాగా ఇదే తరహాలో తైవాన్ పై ఉరకలు వేసిన చైనా ఇప్పుడు వ్యూహం మార్చి భారత్ సరిహద్దులలో చక్కర్లు కొడుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. గతంలో ఇలా చేయడానికి కారణం తైవాన్ పై వ్యూహాత్మక దాడి చేయడానికే అనేది తెలిసిన విషయమే అయినప్పటికీ, ఇది మాత్రం భారత్ ను రెచ్చగొట్టే చర్య అనే నిపుణులు అంటున్నారు. తన దేశంలో పరిస్థితులు అనుకూలంగా చేసుకునేందుకు ఇలాంటి తలకాయలేని పనులు చేస్తుంది చైనా. ఇప్పటికే పీకల లోతులో అక్కడ ప్రజలకు ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నదని, దానిని యుద్ధం పేరుతో దేశభక్తిగా మార్చవచ్చనే నీతిలేని ఆలోచన చేయడం ఒక్క చైనాకే సాధ్యం.

ఇలా ఎన్ని పన్నాగాలు పన్నినప్పటికీ భారత్ సంయమనం పాటిస్తూ తన పని తాను చూసుకుంటుంది. తాజాగా సరిహద్దులలో ఉన్న వారికే విశేష అధికారాలు ఇవ్వడం ద్వారా కేంద్రం కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకొనే అవకాస్లు తగ్గినట్టే. స్వతంత్రంగా సరిహద్దులలో ఉన్న అధికారులే నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఇవ్వడంతో కేంద్రం పై కూడా కాస్త ఒత్తిడి తగ్గినట్టే చెప్పవచ్చు. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ భారతసైన్యం కూడా సందర్బోచిత నిర్ణయాలతోనే అడుగు ముందుకు వేస్తున్నారు. ఇప్పుడు భారత్ వైపు నుండి ఏ చిన్న స్పందన వచ్చినప్పటికీ  చైనా దానిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: