యాదాద్రి పునఃప్రారంభం ఎప్పుడు అని రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్ర‌క‌టిస్తార‌ని ఎదురు చూసారు. కానీ సాయంత్రం త‌రువాత ప్ర‌క‌టించారు. మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం వ‌ర‌కు సీఎం కేసీఆర్ యాదాద్రి ఆల‌యం, ప‌రిస‌ర ప్రాంతాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ముహూర్త పత్రికను స్వామి వారి పాదాల వ‌ద్ద  కేసీఆర్‌ ఉంచారు.  అనంత‌రం మీడియా స‌మావేశంలో మాట్లాడారు.  స్వయంభువుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో విషయాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. సమైక్య పరిపాలనలో అన్ని రంగాల్లో విపరీతంగా నిర్లక్ష్యానికి గురైంది. సామాజిక, ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో నిరాదరణకు గురైంది. గోదావరి, కృష్ణా పుష్కరాలు సైతం ఇక్కడ నిర్వహించలేదు. ఉద్య‌మ‌స‌మ‌యంలో తాను కోరితే పుష్క‌రాలు నిర్వ‌హించారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని వైభవంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఉన్నాం. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం, ప్రారంభాలు ఎప్పుడు చేస్తారని అందరూ అడుగుతున్నారు. అవి మన చేతుల్లో లేవు. అన్నీ ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతాయి.

తిరుమ‌ల‌లో ఉన్న వ‌స‌తుల‌ను యాదాద్రి క‌ల్పిస్తున్నాం.  రామానుజ త్రిదండి చినజీయర్ స్వామి స‌ల‌హాలు, సూచనలతో వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం యాదాద్రి పునఃనిర్మాణ‌ పనులు పరిశీలించారు.  సిద్దాంతులు, వాస్తునిపుణులు వారి ల‌క్ష్యం మేర‌కు కొన‌సాగించారు. పుణ్య‌స్నానాలు ఆచ‌రించేందుకు  పవిత్ర గోదావరి జలాలతో స్వామి వారిని పూజించేందుకు  నృసింహ‌సాగ‌ర్ రిజర్వాయర్ తీసుకొచ్చాం. అతిథుల కోసం టెంపుల్ సిటీలో 250 అధ్బుతమైన కాటేజ్స్ కట్టనున్నాం. యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణ తేదీలు ప్రకటించమని జీయర్ స్వామి వారిని కోరాన‌ని తెలిపారు.

అదేవిధంగా దాదాపు 800 నుంచి 1000 ఎక‌రాల స్థ‌లంలో టెంపుల్ సిటీ ఏర్పాటు చేసిన‌ట్టు వివ‌రించారు. ప్ర‌జాప్ర‌తినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రెండు మూడు రోజుల పాటు గ‌డిపేందుకు వ‌స‌తులు క‌ల్పించాం. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణం, మ‌హాసుద‌ర్శ‌న యాగానికి వైష్ణ‌వులంద‌రీ ఆశీసులు అవ‌స‌రం. ఈ గొప్ప మ‌హ‌త్క‌ర కార్య‌క్ర‌మాన్ని అంద‌రూ దీవించాలి. మార్చి 21న మ‌హాసుద‌ర్శ‌న యాగం అంకురార్ప‌న‌, మార్చి 28న మ‌హాకుంభ సంప్రోక్ష‌ణం నిర్వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న వైష్ణ‌వులు అంద‌రూ పాల్గొంటారు. దేశం నుంచే కాకుండా అమెరికా నుంచి కూడ హాజ‌ర‌వుతార‌ని సీఎం వెల్ల‌డించారు.  సుద‌ర్శ‌న యాగానికి దాదాపు 10వేల రుత్వికులు అవ‌స‌రం ఉంటుందని తెలిపారు. యాదాద్రికి వ‌చ్చే భ‌క్తులు ఇక నుంచి నాన్ వెజ్ తిన‌కూడ‌దు. నాన్ వెజ్ అనేది ఇక్క‌డ అలో చేయ‌రని వెల్ల‌డించారు. అదేవిధంగా కొండ‌పైకి ప్ర‌యాణికుల కోసం ఉచిత బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. ద‌ళ‌త బంధుపై కూడ సీఎం స్పందించారు. అది ఆన్ స్కీమ్ అని.. దానిని ఎవరు ఆప‌లేర‌ని ఓ మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: