ఏపీలో వారసత్వ రాజకీయాలు ఎక్కువనే సంగతి తెలిసిందే. ప్రతి సీనియర్ నాయకుడు తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సక్సెస్ చేయాలని చూస్తారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతల వారసులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. ఇంకా మరికొంతమంది నాయకులు సైతం ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు సైతం దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు.

ధర్మాన ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఆయన నిదానంగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన....మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనకు జగన్ మంత్రి పదవి ఇస్తారో లేదో చూడాలి. ఆ విషయం పక్కనబెడితే...ధర్మాన...నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరగడం తగ్గించేశారట. మొత్తం పనులు ధర్మాన తనయుడు మనోహర్ చూసుకుంటున్నారు.

శ్రీకాకుళంలో పార్టీ బాధ్యతలు ఆయనే చూసుకుంటున్నారు. అయితే తనయుడుని ఎన్నికల బరిలో దింపడానికి ధర్మాన కూడా రెడీ అయిపోతున్నారట. ఇక తనయుడుకు బాధ్యతలు అప్పగించి, తాను తెరవెనుక ఉండి కథ నడపాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే కుదిరితే శ్రీకాకుళం కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లేదంటే...నెక్స్ట్ ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో తాను తప్పుకుని తనయుడుని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


మొదట శ్రీకాకుళం కార్పొరేషన్‌ని వైసీపీ ఖాతాలో వేయడానికి మనోహర్ గట్టిగా కష్టపడుతున్నారట. అదే సమయంలో టి‌డి‌పి ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం..కార్పొరేషన్‌పై కన్నేశారు. కార్పొరేషన్‌లో టి‌డి‌పి జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఇక రామ్మోహన్‌కు చెక్ పెట్టేయాలని రామ్ మనోహర్ ప్రయత్నిస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ బరిలో మనోహర్ దిగడం కూడా దాదాపు ఖాయమైందని శ్రీకాకుళం రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఇక ధర్మాన యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమైతే రామ్ మనోహర్ మొత్తం బాధ్యతలు చూసుకొనున్నారు. మరి చూడాలి రామ్ మనోహర్ నాయుడు ఎంట్రీ నెక్స్ట్ ఎన్నికల్లో ఉంటుందో లేదో.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: