తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం కలిసిరాని పార్లమెంట్ స్థానాల్లో తిరుపతి మొదటి వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. ముందు నుంచి తిరుపతి స్థానంలో టి‌డి‌పికి పెద్దగా గెలిచిన దాఖలాలు లేవు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూసుకుంటే ఒక్క 1984 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది. ఇక పొత్తులో భాగంగా 1999 ఎన్నికల్లో తిరుపతిలో బి‌జే‌పి గెలిచింది. అంతే ఇంకా మళ్ళీ ఎప్పుడు తిరుపతిలో టి‌డి‌పి గెలవలేదు. ఇక రానున్న రోజుల్లో కూడా తిరుపతిలో టి‌డి‌పి గెలవడం అనేది గగనమే అని చెప్పాలి.

ఎందుకంటే తిరుపతి పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలుగా తయారయ్యాయి. పార్లమెంట్ పరిధిలో సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీదే గెలుపు...ఇప్పటికీ ఆ స్థానాల్లో వైసీపీ బలంగానే ఉంది. కాస్త అటు ఇటు అయితే....వచ్చే ఎన్నికల్లో ఒకటి లేదా రెండు సీట్లు టి‌డి‌పి గెలుచుకునే అవకాశాలు లేకపోలేదు.


కానీ మెజారిటీ వైసీపీకి ఉండేలా ఉంది. అంటే తిరుపతి పార్లమెంట్ స్థానం మళ్ళీ వైసీపీ గెలుచుకోవడం ఇబ్బంది కాదు. ఇలాంటి పరిస్తితుల్లో గెలుపు గురించి వదిలేసి టి‌డి‌పి తరుపున పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పనబాక లక్ష్మీ రెండుసార్లు అలాగే చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన పనబాక 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి... దాదాపు రెండు లక్షల 28 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు.


తర్వాత వచ్చిన ఉపఎన్నికలో కూడా అదే పరిస్తితి..2 లక్షల 71 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపుకు గ్యారెంటీ లేదు. కాబట్టి ఈ పరిస్తితులని అంచనా వేసుకుంటే పనబాక ఇక టి‌డి‌పికి గుడ్‌బై చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉపఎన్నికలో ఓడిపోయాక పనబాక పార్టీలో అడ్రెస్ లేరు. మళ్ళీ కనిపిస్తారో లేదో కూడా తెలియదు. కాబట్టి పనబాక దాదాపు బాబుకు బై చెప్పేసినట్లే కనిపిస్తున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp