పేద కుటుంబాల  సంక్షేమం కోసం ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న‌ది.  వీటిలో జాతీయ ఆహార‌భ‌ద్ర‌త ప‌థ‌కం ఒక‌టి. ఈ ప‌థ‌కంలో భాగంగా రేష‌న్ కార్డు ఉన్న‌వారికి ఆహార‌ధాన్యాలు అంద‌జేస్తారు. ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్ సిస్ట‌మ్ కింద కుటంబ స‌భ్యుల సంఖ్య ఆధారంగా చౌక ధ‌ర‌ల దుకాణాల వ‌ద్ద నుంచి స‌రుకులు పంపిణీ ప్ర‌క్రియ చేస్తుంటారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు చాలా కుటుంబాలు రేష‌న్ కార్డులు క‌లిగి లేవు. మ‌రోవైపు రేష‌న్‌కార్డుకు అర్హులు కాని వారు చాలా మంది రేష‌న్ కార్డులు పొంది ఉన్నారు.

ఇందుకోసం కొన్ని కొత్త నిబంధ‌న‌లు అమ‌లు కానున్నాయి. రేష‌న్‌కార్డుకు అన‌ర్హులుగా ఉన్నవారు స‌రుకులు తీసుకుంటున్న‌ట్టు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. దీనిపై కేంద్రం స్పందించి అనర్హుల‌ను గుర్తించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది. మ‌రోవైపు ఇందుకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాల‌కు ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు స‌మాచారం. రాష్ట్రాలు చేసిన సూచ‌న‌ల‌ను అనుస‌రించి కేంద్రం త్వ‌ర‌లో కొత్త‌నిబంధ‌న‌లు అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. పేద‌ల‌కు రేష‌న్ లేకుంటే ఫుడ్‌కు ఎంతో ఇబ్బంది. వారికి అత్య‌వ‌స‌ర‌మైన‌దాంట్లో రేష‌న్ ఒక‌టి. ఆర్థికంగా ఉన్న‌వారు కూడ రేష‌న్‌కార్డు క‌లిగి ఉండ‌డం.. కొంత మంది పేద‌లకు రేష‌న్ కార్డు లేక‌పోవ‌డం లాంటివి సంఘ‌ట‌న‌లున్నాయి. కొత్త రూల్స్‌ను అమ‌లు చేస్తే పేద‌ల‌కు న్యాయం జ‌రుగుతుంది. ఆర్థికంగా ఉన్న‌వారికి రేష‌న్ బంద్ అవుతుంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రీ కొత్త‌రూల్స్ ఎప్పుడు అమ‌లులోకి వ‌స్తుందో చూడాలి.

ఇక తెలంగాణ రాష్టం విష‌యానికొస్తే ఇటీవ‌ల‌నే కొంత మందికి రేష‌న్ కార్డులు కొంత మందికి నూత‌నంగా పంపిణి చేశారు.  రాష్ట్రంలో ఉన్న‌టువంటి కుటుంబాల స‌మాచారం ప్ర‌భుత్వం సేక‌రించింది. దాదాపు ఇప్ప‌టికే 10ల‌క్ష‌ల వ‌ర‌కు కార్డుల‌ను తొల‌గించింది. కానీ అందులో అర్హులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఎన్నో కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: