ఇటీవల అంతర్జాతీయ మీడియా ఒకటే చైనా బలాబలాను పదేపదే చర్చకు లేవనెత్తుతుంది. తద్వారా చైనా బలమైనది అనే ప్రచారాన్ని చేయడానికి ప్రయత్నిస్తుందా లేక చైనా వారికి ఇంతని ఇచ్చి, ప్రచారం చేయించుకుంటుందా అనేది మాత్రం అర్ధం కావడంలేదు. అసలే అన్ని సంక్షోభాలు ఒక్కసారిగా నెత్తి మీదకు వచ్చి అక్కడి ప్రభుత్వం జుట్టు పీక్కుంటుంటే, దానిని ద్రుష్టి మళ్లించడానికి ఈ తరహా ప్రచారం కావాలనే చైనా జరిపించుకుంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. అంతేతప్ప పనికట్టుకొని చైనా పై ప్రచారం చేసే అవసరం ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాకు లేదనేది తెలిసిపోతుంది. చైనా పని అయిపోయింది, దానిని నిలబెట్టడానికి జిన్ పిన్ లేనిపోని అస్త్రాలు ప్రయోగించడమే ఈ ప్రయోగాలు, ప్రచారాల ఆర్బాటం తప్ప మరొకటి కాదు.

ఇప్పటికే కరోనా వైరస్ ప్రపంచానికి అంటించి అందరిని ఇబ్బంది పెట్టింది అనే చెడ్డపేరుతో చైనా కు ఎప్పుడో ప్రపంచం దూరం అయ్యింది. కానీ మళ్ళీ దానిపై వాళ్ళ దృష్టిని మళ్లించడానికే తాను ఇంకా బలంగా ఉన్నాను అంటూ లేని పోనీ ఆర్భాటాలు చేసుకుంటుంది. అందులో భాగమే ఇటీవల చైనా చేస్తున్న ప్రతి చర్య. ఒకపక్క సరిహద్దులలో ఆయా దేశాలను రెచ్చగొట్టడం, భారత్ కు సన్నిహిత దేశాలతో ఉన్న గత బేదాభిప్రాయాలు పక్కన పెట్టి మరీ వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకోవడం లాంటివి చేస్తూనే ఉంది. ఇక తన దేశంలో కూడా ప్రభుత్వం పై వ్యతిరేకత కూడా తీవ్రంగానే ఉంది, ఇలా తన పై ఉన్న ఒత్తిడిని ద్రుష్టి మళ్లించే ప్రయత్నాలే ఈ ప్రచారం తప్ప మరొకటి కాదు.

చైనా ఎన్ని చేసినా భారత్ సంయమనం పాటిస్తుంది. దానిపై ఒత్తిడి తేవడం వలన తనను దాటిపోకుండా నిలువరించ వచ్చు అనేది దాని వ్యూహం. అంటే తాను బాగుపడదు అలాగే ఇతరులు బాగు పడకూడదు అనేది దాని దుష్టబుద్ధి. జిన్ పిన్ కూడా తన పదవి కాలం అయిపోతుండటంతో, ఈసారి ప్రజావ్యతిరేకత పోవాలంటే, యుద్దాలు చేసి, భారత్ పై ఆధిపత్యం తెచుకుంటేనే, అంటే అరుణాచలప్రదేశ్, లఢక్ లను స్వాధీనం చేసుకుంటేనే మళ్ళీ తాను రాబోయే ఎన్నికలలో గెలవగలనని అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా ఈ యుద్ధ  వేస్తున్నాడు. అంటే అప్పుడు ఇంకా చైనాకు ఆయనే శాశ్వత అధినేతగా ఉండాలన్నది జిన్ పిన్ వ్యూహం. ఒక్కడి అధికారదాహం కోసం ఎంతమందిని హింసిస్తున్నాడో ఈ రాక్షసుడు. ముందు వీడిని వేసేస్తే పనైపోద్ది అనిపించే స్థితికి తన శీలాన్ని దిగజార్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: