హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక నువ్వా నేనా అన్నట్లు గా సాగుతున్న సంగతి తెలిసిందే.  ఈ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉండడంతో  ప్రధాన పార్టీలన్నీ... ఓటర్లను తమ వైపు నకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉన్నాయి. ఎలాగైనా  గెలవాలని లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీలు వ్యూహరచనతో ముందుకు సాగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాన్లోకల్ క్యాండెట్ ను తీసుకురావడం తో... ఈ పోరు కాస్త..  టిఆర్ఎస్ పార్టీ మరియు  బిజెపిల మధ్య పోటీ గా మారిపోయింది. 

దీంతో ఓటర్లు కూడా ఓ క్లారిటీకి వచ్చేశారు. వేస్తే టిఆర్ఎస్ పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఓటేసేందుకు జనాలు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్... వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు హుజరాబాద్ నియోజకవర్గానికి వెళ్లని.. మంత్రి కేటీఆర్..  టిఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు..  తన స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరియు బీ జెపి పార్టీలు హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి పేర్కొన్నారు.

అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల అనంతరం... మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని... అందుకే కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం లో ఓ డమ్మీ క్యాండేట్ తీసుకువచ్చిందని  సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలలో కొత్త అలజడి మొదలైంది. చాలా మంది ఓటర్లు... కేటీఆర్ చెప్పిన  మాటలను నమ్మేసి నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను హుజురాబాద్ ఓటర్లు పరిగణిస్తే... కచ్చితంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఓటమి తప్పదనీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీని పై క్లారిటీ రావాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: