ఏపీలో మంగ‌ళ‌గిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు ఆ పార్టీ కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌లు కార్యాల‌యాల‌పై రాష్ట్ర వ్యాప్త దాడులకు నిరసనగా టీడీపీ ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. నిన్న పార్టీ రాష్ట్ర ఆఫీస్ పై దాడి జ‌రిగిన త‌ర్వాత చంద్ర‌బాబు ప్రెస్ మీట్ పెట్టారు. ప్ర‌భుత్వ వైఖ‌రిని తీవ్రంగా నిర‌శించారు. ఈ రోజు ఏపీ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు బంద్ కు పిలుపు ఇవ్వాల‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని పిలుపు ఇచ్చారు.

అయితే ఈ బంద్ కు కొన్ని వ‌ర్గాల నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ ఎదు ర‌వుతోంది. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రం తాము బంద్ కు సహకరించమ‌ని స్ప‌ష్టం చేసింది. వ్యక్తి గత దూషణలతో అ ప్రయోజనాత్మకంగా  ఈ బంద్ కు పిలుపు ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని పేర్కొంది. అందుకే ఈ బంద్ కు తాము సహకరింమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.

ఇక గ‌త రెండేళ్లు గా కరోనా వ‌ల్ల‌ వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారని వాపోయింది. అంతే కాకుండా  ఈ బంద్ వల్ల సమాజానికి ఉపయోగం ఏమీ లేనందున తాము బంద్ కు సహకరించమని తెలిపింది. అయితే మ‌రోవైపు టీడీపీ నేత‌ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డి క‌క్క‌డ హౌస్ అరెస్టు లు చేస్తున్నారు. పోలీసులు ఈ రోజు తెల్ల‌వారు ఝాము నుంచే రంగంలోకి దిగి టీడీపీ నేత‌ల‌ను ముందుగా అదుపు లోకి తీసుకో వ‌డ మో లేదా.. హౌస్ అరెస్టులు చేయ‌డ‌మో చేస్తున్నారు.

ఇక పోలీసులు టీడీపీ నేత‌ల‌కు వార్నింగ్ లు ఇస్తున్నారు. ప్ర‌జ‌లు ఎవ‌రికి వారు స్వ‌చ్ఛందం గా త‌మ ప‌నులు చేసుకోవ‌చ్చ‌ని.. ప్ర‌జ‌ల కార్య‌క‌లాపా ల‌కు ఎవ‌రు అయినా ఆటంకం క‌లిగిస్తే వారిని అరెస్టు చేస్తామ‌ని. వారిపై కేసులు పెడ‌తామ‌ని వార్నింగ్ లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: