కాంగ్రెస్ నుండి ప్రియాంక రంగంలోకి దిగారు. రాహుల్ చేయలేని పనిని ప్రియాంక తన వ్యూహాలతో, ఇందిరాగాంధీ మాదిరిగా రాణించగలదా అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కాంగ్రెస్ పాగా వేస్తుంది. అక్కడ మోడీ ప్రభుత్వాన్ని దెబ్బకొడితే ఇక ఇతర ప్రాంతాలలో పెద్ద విషయం కాదని, అందుకే అప్పుడే ప్రియాంకను బరిలోకి దించింది కాంగ్రెస్. ఇక్కడ వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. అందుకే ఇప్పటి నుండే కాంగ్రెస్ మోడీపై గట్టి నాయకురాలిని తీసుకువచ్చినట్టు అక్కడి ప్రజలలో నమ్మకాన్ని కలిగించడానికి కృషి చేస్తుంది. అలాగే యూపీలో భారీగా మహిళలకు కూడా స్థానాలు కేటాయించింది కాంగ్రెస్. దాదాపు 161 మంది బరిలో మహిళలే ఉన్నారు.

యూపీలో మొత్తం 403 స్థానాలు ఉండగా అందులో కాంగ్రెస్ 161 సీట్లను కేవలం మహిళలకే కేటాయించడం జరిగింది. ఇక్కడ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, మహిళలు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడం అత్యవసరం అని అన్నారు. యూపీలో ఎన్నికలలో మహిళల అభ్యర్థులు ముందుకు రావాలని, వారికోసం కాంగ్రెస్ సీట్లను సిద్ధంగా ఉంచిందని ఆమె అన్నారు. యూపీలో మహిళలకు హక్కులు లభిస్తే కేంద్రం లో కూడా ఖచ్చితంగా పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉత్సాహవంతంగా మహిళలు రాజకీయాలలో వస్తే ఈ సీట్ల సంఖ్య పెంచితీరుతామని అన్నారు.

ఆయా ప్రాంతాలలో పోటీకి దిగే ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ సాయం చేస్తుందని ప్రియాంక తెలిపారు. యూపీలో న్యాయం కోసం గళం విప్పలేని వారికోసం తాను ముందుంటానని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపు నుండి 40 శాతం మహిళలకు సీట్లు కేటాయించడం ద్వారా పార్టీ కులం, మతం, వర్గం లాంటివి చూడబోదని విశేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా మహిళలు ముందుకు వస్తే, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  అయితే ఈ ఎన్నికలలో ప్రియాంక గెలిచేది లేనిది వేచి చూడాల్సి ఉంది. నిజంగా ఆమె మోడీకి పోటీగా బలమైన నేతగా ఎదగాల్సి ఉందా, ఇప్పటికే అలాంటి స్థితి ఉందా  లేదా అనే విషయాలు తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి ఈ ఎన్నికలను.

మరింత సమాచారం తెలుసుకోండి: