గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించిన జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు అదే పార్టీని అంచలంచెలుగా పైకి లేపుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు ఎలాగో కష్టపడి టి‌డిపిని మళ్ళీ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. కానీ చంద్రబాబు వల్ల పూర్తిగా బలోపేతం కావడం లేదని జగన్...టి‌డి‌పి బలం పెంచుకుంటూ పోతున్నట్లు కనిపిస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టి‌డి‌పిని ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూనే వస్తుంది. అధికార బలంతో టి‌డి‌పికి చెక్ పెట్టాలనుకుని, రివర్స్‌లో ఆ పార్టీకి బలం వచ్చేలా చేస్తుంది. వరుసపెట్టి టి‌డి‌పి నేతలు, కార్యకర్తలపై దాడులు, వారిని అరెస్ట్‌లు చేయడం లాంటి పనులతో టి‌డి‌పికి చాలా మైలేజ్ తీసుకొచ్చారు. మామూలుగా వదిలేసి ఉంటే టి‌డి‌పి అంత హైలైట్ అయ్యేది కాదు. కానీ వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరీ టి‌డి‌పిని ఇబ్బంది పెట్టాలనుకుని, ఆటోమేటిక్‌గా ఆ పార్టీకి ప్లస్ అయ్యే పనులు చేస్తున్నారు.

అలాగే వ్యక్తిగత దూషణలు కూడా చేశారు. చంద్రబాబు, లోకేష్‌లని ఏ రేంజ్‌లో తిట్టారో కూడా చెప్పాల్సిన పని లేదు. వారు ఏమన్నా కార్యక్రమం తలపెడితే అడ్డుకుని మరింతగా హైలైట్ చేశారు. ఇలా హైలైట్ చేసుకుంటూ పోతున్న వైసీపీ..తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా టి‌డి‌పి కార్యాలయాలపై దాడులు చేశారు. డ్రగ్స్ విషయంలో టి‌డి‌పి నేత పట్టాభి, సి‌ఎం జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టి‌డి‌పి ఆఫీసులపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఏక కాలంలో దాడులు చేయడం వెనుక వైసీపీ పెద్దల వ్యూహం ఉందని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి.

అలాగే పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు. అయితే ప్రజస్వామ్యంలో మాట్లాడే స్వేచ్చ ఎవరికైనా ఉంటుంది...ఒకవేళ నాయకుడు ఏమన్నా తప్పు మాట్లాడితే లీగల్‌గా చర్యలు తీసుకోవాలి..లేదా మాటలతో కౌంటర్లు ఇవ్వొచ్చు. అలా అంటే వైసీపీ నేతలు ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా చంద్రబాబుని తిట్టారో చెప్పాల్సిన పని లేదు. అప్పుడు టి‌డి‌పి శ్రేణులు వైసీపీ ఆఫీసులపై దాడి చేస్తే పరిస్తితి వేరేలా అయిపోతుంది. ఏదేమైనా జగన్ పనిగట్టుకుని మరీ టి‌డి‌పి బలాన్ని పెంచుతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tdp