చంద్రబాబులో మార్పు రావాల్సిన అవసరం ఉందా? పార్టీలో పైకి హడావిడి చేస్తూ...లోపల ప్రత్యర్ధులతో చేతులు కలిపే నాయకులని పక్కనబెట్టాల్సిన అవసరం ఉందా? అంటే ఖచ్చితంగా ఉందని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. ఎందుకంటే పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి..పార్టీ కోసం ఎక్కువ కష్టపడుతుంది చంద్రబాబు, కింది స్థాయిలో టి‌డి‌పి కార్యకర్తలు...మరి మధ్యలో నాయకులు ఏం చేస్తున్నారు? అంటే కొందరు నాయకులు పార్టీ కోసం నిజాయితీగానే కష్టపడుతున్నారని, కానీ కొందరు మాత్రం బాబు చుట్టూ చేరి భజన చేస్తూ, పదవులు తీసుకుని హడావిడి చేస్తున్నారే తప్ప, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం లేదని తెలుస్తోంది.

తాజాగా టి‌డి‌పి కేంద్ర కార్యలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. కేవలం ఒక్కచోటే కాదు ఏక కాలంలో రాష్ట్రంలో ఉన్న టి‌డి‌పి ఆఫీసులపై దాడులకు చేశారు. టి‌డి‌పి అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు. ఇక దాడులు జరిగే సమయంలో అక్కడక్కడ పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసి దెబ్బలు తిన్నారు. తర్వాత చంద్రబాబు, లోకేష్‌లు వైసీపీపై ఫైర్ అయ్యారు. టి‌డి‌పి శ్రేణులకు ధైర్యం చెప్పారు. అలాగే రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.

అయితే ఈ దాడుల విషయంలో కొందరు నేతలు సైలెంట్‌గా సైడ్ అయినట్లే కనిపిస్తోంది. ఏదో దాడులని ఖండించి లైట్ తీసుకున్నారు. ఇక బంద్‌కు పిలుపునిస్తే అనుకున్న స్థాయిలో సక్సెస్ చేయలేకపోతున్నారు. మరి పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తే ఆగిపోతున్నారో...లేక కావాలని హౌస్ అరెస్ట్‌లు అయిపోతున్నారో అర్ధం కాకుండా ఉంది. మొత్తానికి చూసుకుంటే కొందరు నాయకుల్లో పోరాట పటిమ కొరవడిందనే టి‌డి‌పి కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.

అసలు ఇదే పొజిషన్‌లో జనసేన పార్టీ ఉంటే వేరే పరిస్తితిలో ఉండేదని కూడా చెప్పుకుంటారు. ఆ పార్టీకి క్యాడర్ తక్కువైన సరే ఎక్కడా తగ్గకుండా వైసీపీపై పోరాడేదని, కానీ ఆ పోరాటం టి‌డి‌పి నేతల్లో లేదని, ఇప్పటికైనా భజన బ్యాచ్‌ని పక్కనబెట్టి, పార్టీ కోసం నిలబడే వారిని ఎంకరేజ్ చేస్తే బెటర్ అని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

Tdp