ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం రంజుగా సాగుతోంది. ఓ వైపు విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ఆందోళనలు, నిరసనలు, కేసులు, గృహ నిర్భందాలు... అరెస్టులు, రాస్తారోకోలు... ఇలా రాష్ట్రమంతా వాతావరణం హాట్ హాట్ గా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.... తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. అక్కడ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల కార్యాలయంపై కూడా దాడి జరిగింది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని హెచ్చరించారు కూడా. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. గాయపడిన నేతలు, కార్యకర్తలను పరామర్శించారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

పార్టీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా పరిగణించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... రాష్ట్ర బంద్‌నకు పిలుపు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. ఇంత వరకు బాగానే ఉన్నా... అధినేత తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు రాష్ట్ర పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగితే... ఇప్పటిక వరకు కనీసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించలేదు. కనీసం బయటకు రాలేదు. సొంత నియోజకవర్గంలోని కార్యాలయంపైనే దాడి జరిగినప్పటికీ.... లోకేష్ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. ఇక బంద్‌ చేయాలని పిలుపు ఇచ్చిన చంద్రబాబు పరిస్థితి కూడా సేమ్.  ధర్నా చేయడం సంగతి పక్కన పెడితే... కనీసం పార్టీ కార్యాలయానికి కూడా చేరుకోలేదు. ఇంటికే పరిమితం అయ్యారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్‌లో ఆవేశంగా మాట్లాడిన చంద్రబాబు... ఇల్లు కూడా దాటకపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: