ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏ రాజ‌కీయ‌ అనుభవం లేకపోయినా అధికారంలోకి వచ్చి ముఖ్య‌మంత్రి అయ్యారు. జ‌గ‌న్ కు ఏ మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన అనుభ‌వం కూడా లేదు. డైరెక్టుగానే ముఖ్య‌మంత్రి అయిపోయారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి గా అధికారంలోకి వచ్చి ఇంకా మూడేళ్లు కూడా కాలేదు. కానీ ఏనాడూ పాలనను సజావుగా కొన‌సాగుతోన్న ప‌రిస్థితి అయితే క‌న‌ప‌డ‌డం లేదు. జ‌గ‌న్ ముఖ్య‌మం త్రి అయిన‌ప్ప‌టి నుంచి కేవ‌లం సంక్షేమాన్నే బేస్ చేసుకుని పాల‌న కొన‌సాగిస్తోన్న ప‌రిస్థితి ఉంది.

అస‌లు అభివృద్ధి గురించి జ‌గ‌న్ ఆలోచి స్తోన్న ప‌రిస్థితి లేదు. ఇదే ఇప్పుడు ప్ర‌భుత్వం పై సామాన్య ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త కు కార‌ణం గా క‌నిపిస్తోంది. మ‌రో వైపు ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌తిప‌క్షం తో పాటు చంద్ర‌బాబు చేస్తోన్న పోరాటాల‌కు ప్ర‌జ‌ల లో మ‌ద్ద‌తు క‌నిపిస్తోంది. మ‌రో వైపు జ‌న‌సేన కూడా పుంజుకుంటోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద రెండేళ్ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఇసుక గురించి ఎక్కువుగా క‌నిపిస్తోంది.

ఇసుక కొర‌త తో పాటు ఇసుక అక్ర‌మాల మీద చంద్రబాబు చేసిన ఉద్యమాన్ని ప్రజలు కూడా హర్షించారు. కానీ సంక్షేమ పథకాల విషయంలో అమలు కాకుండా జాప్యం చేయించడంతో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్లు కూడా టైంకు ఇవ్వ‌క పోవ‌డంతో ఈ వ‌ర్గాల్లోనూ ప్ర‌భుత్వం ప‌ట్ల తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఇక మ‌రో వైపు న్యాయ స్థానాల నుంచి వ‌రుస‌గా ప్ర‌భుత్వాని కి మెట్టి కాయ‌లు ప‌డుతూనే ఉన్నాయి

దీంతో పాటు ప్ర‌పంచ మ‌హ‌మ్మారి కరోనాతో దాదాపు ఏడాదిన్నర జగన్ పాలనలో ముందడుగు ప‌డ‌లేదు. వీటికి తోడు చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తుండటం కూడా జగన్ అడుగు ముందుకు వేసే విష‌యంలో కొన్ని బ్రేకులు ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. ఏదేమైనా పై న చెప్పుకున్న కార‌ణాలు అన్ని కూడా జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో మైన‌స్ మార్కులు ప‌డేందుకు ప్ర‌ధాన కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: