400 రోజులు, 90 అసెంబ్లీ స్థానాలు ఇది లెక్క. తండ్రిని గుర్తుచేస్తూ,పార్టీని చేరువ చేస్తూ  నడుస్తూ నడుస్తూ, ఆ యాత్రలోనే ఎదుగుతూ, ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తూ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీని సాధిస్తూ అధికారానికి చేరువవుతుంది. ఇదే ఇప్పుడు షర్మిల ముందున్న నాలుగు వేల కిలోమీటర్ల పొడవైన లక్ష్యం. తండ్రి సెంటిమెంట్ అయినా చేవెళ్ల నుంచే తన పాదయాత్రను చేపట్టనున్నారు. గ్రేటర్ పరిధి మినహా రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర కొనసాగుతుంది. పార్టీ ఆవిర్భావం రోజే మరో వంద  రోజుల్లో పాదయాత్ర  చేస్తానని షర్మిల ప్రకటించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా, తన బాణం తానే వదులుకున్నారు. నిజానికి ఈ పాదయాత్ర మీదే షర్మిల పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఆందోళనలు ఆత్మీయ సమ్మేళనం, నిరసనలు నీరసించి పడి పోవడాలు, ప్రజా పోరాటాలు పోలీసులతో కొట్లాటలు, నిరుద్యోగులతో సావాసం  వారానికి ఒకసారి ఉపవాసం.

 ఏది పార్టీ ని లోటస్ పాండ్ కాంపౌండ్ దాటి బయటకు తీసుకు రాలేదు. దీంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని, పార్టీని ప్రజలకు చేరువ చేయాలని, సీఎం పీఠంపై వీలైనంత త్వరగా  కూర్చోవాలని షర్మిల ప్లాన్ గీసారు. ఆ కుటుంబానికి ఉన్న తెలంగాణ వ్యతిరేకి ముద్రను షర్మిల ఎలా క్లీన్ చేయబోతున్నారన్నది పక్కన పెడితే ఆమె పాదయాత్ర నిర్ణయమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి వై ఎస్ ఆర్ టి పి కి సంబంధించి లోటస్ పాండ్ గ్రౌండ్లో అవుట్ గోయింగ్ లే తప్ప ఇన్ కమింగ్ లు లేవు. అలాంటిది ఇప్పుడు పాదయాత్రలో భాగంగా జనాల రియాక్షన్  ఎలా ఉంటుంది, ఎంత మంది నాయకులు కలిసి నడుస్తారు అన్నదాని మీదే షర్మిల పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పటికే పీకే టీమ్ రంగంలోకి దిగింది. ఇదంతా ఎలా ఉన్నా పాదయాత్ర అనేది రాజకీయంలో బ్రహ్మాస్త్రం లాంటిది.

దీని తర్వాత సంధించడానికి, పోరాటం చేయడానికి పెద్దగా ఆప్షన్లు ఉండవు.నిజానికి వైయస్సార్ జగన్ కు లేని సవాళ్లు కూడా ఇప్పుడు షర్మిల ముందు ఉన్నాయి. వైయస్ మీద తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర ఉండడం, వైయస్సార్ టీపీకీ బలమైన  క్యాడర్ లేకపోవడం, షర్మిలకు రాజకీయంగా అనుభవం లేకపోవడం మరి వీటన్నింటిని షర్మిల ఎలా అధిగమిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: