తెలంగాణ లో వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు అని వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు. కళ్ళముందు 1.90లక్షల ఉద్యోగాలు కనిపించినా నోటిఫికేషన్లు రావు అన్నారు ఆమె. నిరుద్యోగులు టిఫిన్ సెంటర్లు...హమాలిలుగా మారారుఅని ఆవేదన వ్యక్తం చేసారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన కేసీఆర్ మేడలు వంచెందుకు ఈ పాదయాత్ర అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ లో 7 ఏళ్లలో 30 వేళ ఉద్యోగాలు పీకేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

విద్య వ్యవస్థ ను బలోపేతం చేసేందుకు ఈ పాదయాత్ర అన్నారు ఆమె. కేసీఆర్ లాంటి పని మంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందని వ్యాఖ్యలు చేసారు. లక్షా 30 వేళ కోట్ల కాళేశ్వరం గా ఎందుకు మారింది అని ఆమె ప్రశ్నించారు. కమీషన్ లకోసం ప్రాజెక్ట్ వ్యయం పెంచారు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పలేదు అని అబద్ధాలు చెప్తున్నారు అని మండిపడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ లేదు..ఉచిత విద్య లేదు అని విమర్శించారు. తెలంగాణ లో 800 శాతం దళితుల పై దాడులు పెరిగాయి అని ఆరోపణలు చేసారు.

కేసీఆర్ అహంకారం దించడానికి ఈ పాదయాత్ర అని ఆమె వ్యాఖ్యలు చేసారు. అయ్యా కొడుకులు మాటలు చెప్పే మొనగాళ్లు అని అన్నారు. పూటకు భత్యం ఇచ్చే మొనగాళ్లు మాత్రం కాదు అన్నారు షర్మిల. తెలంగాణ లో సమస్యలు లేకుంటే నా ముక్కు నేలకు రాస్తా అని ఆమె సవాల్ చేసారు. పాదయాత్ర ముగించి ఇంటికి వెళ్తా అని అన్నారు. సమస్యలు ఉంటే కేసీఆర్ రాజీనామా చేయాలి అని ఆమె వ్యాఖ్యలు చేసారు. నాతో పాదయాత్ర చేస్తే సమస్యలు చూపిస్తా అని నా సవాల్ కేసీఆర్ కి దమ్ము ఉంటే స్వీకరించాలి అని ఆమె సవాల్ చేసారు. నేను వచ్చాకే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు అని వైఎస్ షర్మిల  వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts