మ‌ద్యం వాడ‌కాన్ని త‌గ్గించి ఆరోగ్యాలు కాపాడు కోవాల‌ని ప‌లు రాష్ట్రాల‌లో ప‌లు ర‌కాల చ‌ట్టాలను చేస్తారు. మ‌ద్యం వ‌ల్ల చాలా అన‌ర్థాలు జ‌రుగుతాయి కాబట్టి దానిని నిర్ములించ‌డానికి ప్ర‌భుత్వాలు కొన్ని క‌ఠిన శిక్స‌ల‌ను కూడా విధిస్తుంది. మ‌న రాష్ట్రంలో ఎవ‌రైన మ‌ద్యం తాగి ప‌ట్టు ప‌డితే పోలీసులు జ‌రిమానాతో పాటు శిక్ష విధిస్తారు. అలాగే వారు మ‌ళ్లి అలా చేయ‌కుండ కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. అలాగే మ‌ద్యం ను అరిక‌ట్ట‌డానికి ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సంపుర్ణంగా మ‌ద్యం పై నిషేధం విధించారు. బిహార్ తో పాటు మ‌రి కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ద్యం పై నిషేధం విధించారు. అలాగే మ‌రి కొన్ని రాష్ట్రా ప్ర‌భుత్వాలు క‌ఠిన ఆంక్ష‌లు విధించాయి. ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల‌లో క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు అవుతున్నాయి. అయితే గుజ‌రాత్ లో ని కొన్ని గ్రామాల్లో మ‌ద్యం తాగి ప‌ట్టు ప‌డితే వింత అయిన శిక్ష వేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసు కుందాం.



గుజరాత్ లో ని సురేంద్ర న‌గ‌ర్, అమ్రేలీ, క‌చ్, మోతిపుర వంటి జిల్లాల్లో సంపూర్ణంగా మ‌ద్యం పై నిషేధం కొనసాగుతుంది. అయితే ఈ జిల్లాలో ఉన్న గ్రామాల్లో ఒక వింత నిబంధ‌న పెట్టారు. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు మ‌ద్యం తాగ లంటే బ‌య‌ప‌డుతున్నారు. అంత బ‌యంక‌రంగా ఏ నిబంధ‌న పెట్టారు అని ఆలోచిస్తున్నారా. ఎమి లేదండి. మ‌ద్యం తాగి ప‌ట్టు ప‌డిన వారు ఆ ఊరంద‌రికీ 25 వేల రూపాయాల‌తో మ‌ట‌న్ బీర్యానీ చేసి దావ‌త్ ఇవ్వాలి. అలాగే ఆయా గ్రామ పంచాయ‌తీ ల‌కు 3 వేల రూపాయాలు క‌ట్టాలి. ఇలాంటి నిబంధ‌న‌లు పెట్టారు. దీంతో ఆ గ్రామాల్లో మ‌ద్యం తాగాలంటే నే జ‌నాలు బ‌య‌ప‌డుతున్నారు. ఒక వేల తాగాల్సి వ‌చ్చిన పక్క గ్రామాల్లో తాగి రాత్రి అక్క‌డే ఉండాలి. తాగి మ‌ళ్లి ఈ గ్రామానికి వ‌చ్చినా.. పైన ఉన్న నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. దీంతో ఆ గ్రామాల్లో చాలా మంది మ‌ద్యం తాగ‌డం మానేశార‌ట‌. దీంతో ఇలాంటి నిబంధ‌న‌లు చాలా గ్రామాల‌కు వ‌స్త‌రిస్తుంద‌ని సమాచారం.




మరింత సమాచారం తెలుసుకోండి: