తెలంగాణ లో పార్టీని స్థాపించి క్రీయాశీలక రాజకీయ నాయకురాలిగా ఎదిగేందుకు షర్మిల ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు  ఒకవైపు కెసిఆర్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తూనే మరోవైపు ప్రతిపక్ష పార్టీలను కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వైయస్ షర్మిల. ఈ క్రమంలోనే ఇక రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను కూడా తెరమీదికి ప్రజల తరఫున నేను పోరాడతాను అంటూ చెబుతున్నారు.  ఇప్పటికే నిరుద్యోగుల సమస్యలను తెరమీదికి తెచ్చి దాని పై పోరాటం సాగిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ షర్మిల  అటు ప్రతిపక్ష ఇటు అధికార పక్షంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


 తెలంగాణలో ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైయస్ షర్మిల  కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని అరువు తెచ్చుకుంది అంటూ వ్యాఖ్యానించారు  గత ఏడేళ్ల నుంచి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అంటూ వైఎస్ షర్మిల ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ బిజెపి పార్టీలు ఒక్కటేనని.. రహస్యంగా ఒకటిగానే సాగుతున్నాయి అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. కానీ బయటికి మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ని ప్రశ్నించే మగాడే లేడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైయస్ షర్మిల  ఇక ప్రస్తుతం షర్మిల చేసిన వ్యాఖ్యలు కాస్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయ్.  కాగా టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను తెరమీదికి తెస్తూ ఇక టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను కూడా ప్రస్తావిస్తూ ప్రజల తరఫున పోరాడతాను అంటూ ఇప్పటికే ప్రకటించారు అన్న విషయం తెలిసిందే  అనుకున్నట్టుగానే ఒక్కో సమస్యను తెరమీదికి తెచ్చారు. ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా ఓ వైపు పార్టీ బలాన్ని పెంచుకోవడమే కాదు ప్రజల్లో ఆదరణ కూడా పెంచుకోవడానికి వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు వైయస్ షర్మిల

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr