బ్రిటన్ లో మూడో వేవ్ కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చాపకింద నీరులా కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. జులై వరకు ఇక్కడ కరోనా నెమ్మదించింది, మరోవైపు దాదాపు అందరికి వాక్సిన్ కూడా ఇచ్చారు. దీనితో ఇంకా భయపడాల్సిన అవసరం లేదనుకొని అందరు కరోనా నిబంధనలు పాటించకుండా పూర్వ స్థితికి వచ్చేశారు. అదే ఇప్పుడు ఇబ్బందికి గురిచేసింది. మూడో వేవ్ వెళ్లకుండానే నిబంధనాలు సడలించడం తో మరోసారి కరోనా విజృంభిస్తుంది. జులై నాటికి అంతా సర్దుకుంది అనుకోని అన్ని సంస్థలకు నిర్వహణ అనుమతులు ఇవ్వడంతో పాఠశాలలు, కళాశాలలు, ఇలా అన్ని తెరుచుకున్నాయి. దీనితో ప్రజలు కూడా విచ్చలవిడిగా నిబంధనలు లేకుండా సాధారణ జీవితాన్ని గడపడం తో ఇప్పుడు ప్రమాదం వచ్చి పడింది.

గత రెండు వారాలుగా ఇక్కడ 35-40 వెలమధ్య కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య 50 వేల మార్కును కూడా దాటేసింది. రోజు వందకు పైగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇప్పటికే మరణాల సంఖ్య 38000 కు చేరింది. ఇప్పటికి బ్రిటన్ లోనే ఈ స్థాయికి కరోనా విజృంభణ ఉంది. తాజాగా కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య ఘననీయంగా పెరిగిపోతుందని, మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతుందని వైద్యులు అంటున్నారు. విద్యార్థులు ఎక్కువ మంది ఈసారి వైరస్ బారిన పడుతున్నట్టు వారు అంటున్నారు. అలాగే బ్రిటన్ పాఠశాల విద్యార్థుల లో కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని వారు తెలిపారు.

విద్యార్థులకు వాక్సిన్ ఇప్పటికి తక్కువగానే ఇవ్వడంతో వారిలో ఈసారి వైరస్ ఉదృతి ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. కరోనా నిబంధనలు అందరు తిలోదకాలు వదిలేయడంతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కనీసం మాస్క్ కూడా ఎవరు ధరించడం లేదు. కేవలం వైరస్ సోకినా వారు మాత్రం ధరిస్తున్నారు. ఇప్పటివరకు బ్రిటన్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జనికా మీద ఆధారపడింది. ముందుగా ప్రపంచంలో టీకాను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించింది బ్రిటన్. అయినా బూస్టర్ డోస్ కూడా ఇవ్వడం జరిగింది, ఇది 41 శాతం మందికి ఇచ్చారు. దానిని ఇవ్వడం ఇంకా కొనసాగుతుంది. అంతలోపు మహమ్మారి కాటువేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: