వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ క‌న్నా ఎక్కువ సీట్లు టీడీపీకి ఎలా వ‌స్తాయ‌న్న‌ది ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. త‌మ పాల‌న‌పై అమితం అయిన ఆస‌క్తి , ప్రేమ ఉన్న జ‌గ‌న్ అదే న‌మ్మకంతో జ‌నం ముంద‌రికి వెళ్లి ఓట్లు అడిగితే అప్పుడు ఆయ‌నకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారు అన్న‌ది  వైసీపీ ఊహ‌. ఊహ‌లు నిజం అవుతాయా అన్న‌ది చెప్ప‌లేం. సంక్షేమం ఫ‌లిస్తే మ‌ళ్లీ అధికారం జ‌గ‌న్ ది.. వ్య‌తిరేక  స్వ‌రం గ‌ట్టిగా వినిపిస్తే టీడీపీ మ‌ళ్లీ అధికారం కైవ‌సం చేసుకోవ‌డం ఖాయం. ఈ ద‌శ‌లో వ్య‌తిరేక‌త అన్న‌ది ఎవ‌రికి అనుకూలం?  ఎవ‌రికి సంబంధం లేని విష‌యం? 

చంద్ర‌బాబు క‌న్నా జ‌గ‌న్ పాల‌న బాగోలేదని ఎలా అంటారు? జ‌గ‌న్ సంక్షేమమే ధ్యేయంగా ప‌నిచేస్తున్న‌ప్పుడు వ్య‌తిరేక‌త ఉంటుంద‌ని ఎలా అనుకుంటారు? ఎలా అయినా స‌రే పాల‌న‌కు అడ్డం పెట్టాల‌న్న‌ది టీడీపీ వాద‌న‌గా ఉంది? ఇది స‌బ‌బు కాదు.
- వైసీపీ పెద్ద‌లు
 
రాష్ట్రంలో టీడీపీ వైసీపీ వ‌ర్గాలు తెగ వాగ్వాదాలు ప‌డుతున్నాయి. అధికారంలో ఉన్నా లేకున్నా తాము ప్ర‌జ‌ల‌వైపే అని టీడీపీ చెబుతోంది. ఇదే స‌మ‌యంలో పాల‌క ప‌క్షం  త‌ప్పిదాల‌ను వెలుగులోకి తెచ్చేందుకు తాము కృషి చేస్తూనే ఉంటామ‌ని కూడా చెబుతోంది. అదేవిధంగా ప్ర‌జ‌ల‌కు అందాల్సిన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు అస్స‌లు జ‌గ‌న్ కృషి చేయడం లేద‌ని కూడా అంటోంది. ఇవ‌న్నీ ఎలా ఉన్నా క‌నీసం రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు సైతం నిధులు ఇవ్వ‌డం లేద‌ని వాపోతోంది. ఈ క్ర‌మంలో తాము నిర‌స‌న‌ల‌కు ఇంకా ప్రాధాన్యం ఇస్తామ‌ని అణిచేస్తే ఇంకా ఇంకా బాగా ప‌నిచేసేందుకు ఉత్సాహం పెంపొందించుకుంటామ‌ని కూడా అంటున్నారు సంబంధిత నాయ‌కులు. ఇదే ద‌శ‌లో పాల‌న‌పై విప‌రీతం అయిన వ్య‌తిరేక‌త ఉంద‌ని కూడా అంటున్నారు ప‌సుపు పార్టీ పెద్ద‌లు.




ఇక వైసీపీ పాల‌న‌పై వ్య‌తిరేక‌త ఉందా లేదా అన్న‌ది ఓ సారి చూద్దాం. గ‌తంలో క‌న్నా ఇప్పుడు వైసీపీ పాల‌న చాలా దీనావ‌స్థ‌లో ఉంద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. త‌మ హ‌యాంలో అభివృద్ధిని నిలుపుద‌ల చేసి, వైసీపీ పంతం నిరూపించుకోవ‌డం త‌ప్ప సాధించిందేం లేద‌ని చెబుతోంది. ఇవ‌న్నీ ఎలా ఉన్నా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో కొన్ని లోపాలు ఉన్నాయి అని, వాటిపై గొంతెత్తితే అరెస్టులు చేస్తున్నార‌ని వాపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: