ప్రపంచం ముందు, మారాం మారం అంటూ తాలిబన్ లు మళ్ళీ మొదటికే వస్తున్నారు. తాము, ఐఎస్ వేరని ఒకటి కాదన్నట్టు ఇటీవల కాబుల్ లోని ఒక మసీదులో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు అన్న తాలిబన్ లు ఇప్పుడు ఆ దాడులు చేసిన ప్రాణాలు గొప్పవని, అవి ఇస్లామ్ ను ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టడానికి అల్లాకు సమర్పించబడ్డాయి అంటూ నిజమైన తీవ్రవాదులుగా మాట్లాడారు అక్కడి మంత్రి. పేరుకు దేశం, పేరుకు మంత్రి కాబట్టే ఇలా వాళ్ళ మనుషులను చంపిన వారిని కూడా పొగుడుతున్నారు. అంతటితో ఆగలేదు, అలాంటి త్యాగాలు చేసిన వారికి నగదు, ఒక ఇళ్లు లాంటి బహుమతులు కూడా ప్రకటించారు తాలిబన్ మంత్రివర్యులు.

ఆఫ్ఘన్ ఆక్రమణ జరిగి ఇంతకాలం అవుతున్నప్పటికీ అక్కడ జనం సరిగా ఉన్నారా లేదా అనేది పట్టించుకోకుండా, ఐఎస్ తో కలిసి తమ వర్గ పోరులో ఒకరిని ఒకరు చంపుకుంటూ వారికి తమ మతంపై ఎంత గౌరవం ఉందో ప్రపంచానికి చెప్పకనే చెపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘన్ లో ఉన్న షియా వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే మరో రెండు దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఇలా చేయడం వలన ప్రపంచంలోని వాళ్ళ వాళ్ళను తమ పంధాలోకి బలవంతంగా చేర్చుకోవాలన్నది బహుశా వాళ్ళ అసలు వ్యూహం కావచ్చు. ఇన్నాళ్లు అల్లా పేరు చెప్పుకుని ఎందరినో పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులు, ఇప్పుడు తమ వర్గాలను కూడా చంపుకునే స్థాయికి దిగజారిపోయారు.

ఈ స్థితికి కారణం వారిలో ప్రస్తుతం విజయం సాధించాం అనే అహం కావచ్చు. ఇలా భారత రైతు ఉద్యమం వరకు వాళ్ళు రాగలిగారు. అలా చేయడం పెద్ద విషయం వాళ్లకు కాకపోవచ్చు కానీ, ఎన్ని చేసినా మత ఛాందసవాదుల వెంట కనీసం వారి మతం వాళ్ళు కూడా ఉండబోరనేది ప్రపంచ ఇస్లాం నిరూపించాల్సిన సందర్భం ఇది. అంతేగాని ఉగ్రవాదులకు బయపడి, హిందువుల మీద దాడులు వాళ్ళే చేస్తున్నారు అనేది కూడా ప్రచారమే, ఆ అఘాయిత్యాలకు దిగేది కూడా తీవ్రవాద ప్రేరేపిత వర్గాలు తప్ప మతాన్ని నమ్ముకున్న వాళ్ళు కాదని ఈ సందర్భంగా అంటారు తెలుసుకోవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఏదైనా నమ్మే ముందు స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ప్రపంచ ప్రజల ముందు ఉన్న కనీస బాధ్యత.

మరింత సమాచారం తెలుసుకోండి: