భారత దేశం సర్వమత సమ్మేళనం. భరత ఖండంలో అన్ని మతాల వారు నివసిస్తున్నారు. దేశంలో ప్రజా స్వామ్యం కారణంగా సంక్రమించిన రాజ్యాంగ హక్కులతో జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగే వారి వారి మతాచారం ప్రకారం వివాహాలు చేసుకునే హక్కు కూడా ఉంది. అయితే కొన్నేళ్లుగా మత మార్పిడులు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో ఇతర మతస్థులపై దాడులు కూడా పెరిగిపోయాయి. తాజాగా మత వివాహాల నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లీం మత వివాహం అనేది ఎన్నో అర్థాలతో జరిగే ఒప్పందమంటూ కామెంట్ చేసింది. అదే సమయంలో.... హిందూ వివాహాలపై వివాదాస్పద కామెంట్స్ చేసింది హైకోర్టు. మత కర్మ మాదిరి హిందూ వివాహాలు కాదని... కామెంట్ చేసింది. వివాహ బంధం రద్దు వల్ల వచ్చే కొన్ని హక్కులు, బాధ్యతలు ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించడం కుదరదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. బెంగళూరు నగరంలోని భువనేశ్వర్ నగర్‌కు చెందిన రెహ్మాన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ చేసింది.

1991, నవంబర్ 25వ తేదీన తొలి భార్య సైరా బాను నుంచి విడాకులు తీసుకున్న రెహ్మాన్.... అప్పట్లో ఆమెకు భరణం కింద... 5 వేల రూపాయలు కూడా చెల్లించారు. కానీ సరిగ్గా 11 ఏళ్ల తర్వాత 2002 ఆగస్టు 24వ తేదీన భరణం కోసం సివిల్ దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు.... బాను మరణించే వరకు లేదా... మరో వివాహం చేసుకునే వరకు ప్రతి నెలా 3 వేల రూపాయలు ప్రతి నెలా భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫ్యామిలీ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించాడు రెహ్మాన్. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. వివాహం ఒక కాంట్రాక్ట్ అనే మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయన్నారు జస్టిస్ కృష్ణ దీక్షిత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కామెంట్ చేసింది. హిందూ వివాహానికి భిన్నమైన మత కర్మ కాదన్నారు. ఇదే వాస్తవమంటూ కామెంట్ చేశారు. విడాకులు తీసుకోవడం వల్ల రద్దయిన వివాహం బాధ్యతలను మరిపించగలదు.


మరింత సమాచారం తెలుసుకోండి: