టీడీపీ మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఇటీవ‌ల రాజ‌కీయంగా రాటు దేలుతోన్న ప‌రిస్థితి ఉంది. కొద్ది రోజులుగా లోకేస్ వైసీపీ మాట‌ల‌కు మాటే స‌మాధానం అన్న‌ట్టుగా ఆన్స‌ర్లు ఇస్తున్నారు. తాను కౌంట‌ర్లు ఇచ్చే విష‌యంలో  ఏ మాత్రం వెనక్కు త‌గ్గ‌న‌ని చెపుతూనే ఉన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వైసీపీ వాళ్లు , ఆ ప్ర‌భుత్వం చేసిన దుర్మార్గ‌పు చ‌ర్య‌లు అన్నింటికి రివేంజ్ తీర్చు కుంటామ‌ని ఓపెన్ గానే చెపుతున్నారు. తాజాగా మంగ‌ళ గిరి లోని టీడీపీ ప్ర‌ధా న కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు దాడి చేయ‌డంతో లోకేష్ తీవ్ర స్థాయిలో వైసీపీ ప్ర‌భుత్వం పై విరుచు కు ప‌డ్డారు.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ బూతుల‌కు కేరాఫ్ గా మారింద‌ని... బూతులకు వైసీపీనే యూనివర్శిటీ అని.. చంద్రబాబును.. ప్రతిపక్ష నేతలను.. ఉద్యోగులను బూతులు తిట్టిన వారినేం చేశారు..? కేసులెందుకు పెట్టలేద‌ని లోకేష్ ప్ర‌శ్నించారు. అలాగే ప్ర‌కాశం జిల్లా గిద్దలూరులో ఎమ్మెల్యేని నిలదీసినందుకు దళిత యువకుడ్ని చంపేయ‌డం అత్యంత దుర్మార్గ‌పు చ‌ర్య కాదా ? అని లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో వెంట‌నే ఎమర్జెన్సీ ప్రకటించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

పార్టీ కార్యాలయంపై దాడి చేసి తలలు పగల కొడితే హత్యాయత్నం కేసు పెట్టి.. సీఐను తాము జాగ్ర‌త్త‌గా అప్ప‌గిస్తే దానిపై హత్యాయత్నం కేసు పెట్ట‌డం సిగ్గు చేట‌ని విమ‌ర్శించారు. చంద్రబాబుకు చాలా ఓపిక ఎక్కువ అని.. తాను మాత్రం అలా కాదు.. వడ్డీతో సహా చెల్లిస్తా అని ఘాటుగా కౌంట‌ర్లు ఇచ్చారు. వైసీపీ మూక‌లు దాడి చేసింది కేవ‌లం పార్టీ కార్యాలయంపై దాడి కాదు.. దేవాలయంపై దాడి అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక డీఎస్పీ కూడా దాడి చేసిన వాళ్ళను  దగ్గరుండి కార్లు లో పంపింది నిజం కాదా ? అని లోకేష్ ధ్వ‌జ‌మెత్తారు. ఏదేమైనా లోకేష్ రివేంజ్ విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌ర‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: